Off The Record: శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గానికి రాజకీయంగా ప్రాధాన్యత ఉంది. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఎలాగైనా ఆయన్ని ఓడించి తీరాలన్న పట్టుదలతో ఉంది అధికార పార్టీ. కానీ…స్థానికంగా ఉన్న గ్రూపులు వైసీపీని ఇరుకున పెడుతున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి , కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ … ఇలా ముగ్గురు మూడు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.…
శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టెక్కలి రోడ్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని గుడ్డలూడదీసి కొడతానని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలా కొట్టకపోతే తాను దువ్వాడ శ్రీనివాస్‌నే కాదన్నారు. అచ్చెన్నను తన్నటానికి ఒక్క నిమిషం చాలన్నారు. దిక్కుమాలిన టీడీపీకి గత్యంతరం లేక అచ్చెన్నాయుడిని అధ్యక్షుడిని చేశారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విమర్శించారు. Chinta Mohan: మోదీ చేస్తున్న ఆ పనిని ఆపి తీరుతా.. అందుకే ఢిల్లీ వెళ్లొచ్చా మహానాడు…
చేతికి పదవి వస్తే కొందరు గాలిలో తేలిపోతారు. అప్పటి వరకు చుట్టూ ఉన్నవాళ్లకు కూడా అందకుండా పోతారు. ఆ ఎమ్మెల్సీ సైతం అంతేననే టాక్ వైసీపీ కేడర్‌లో గట్టిగానే వినిపిస్తోంది. అయ్యవారు సోషల్ మీడియాలో చురుకు కావడంతో… ‘సార్..! మా గోడు’ పట్టించుకోండి అంటూ అదే సామాజిక మాధ్యమాల్లో రిక్వస్ట్‌లు పెడుతున్నారట. దీంతో పదవి రాకముందు దువ్వాడ.. పదవొచ్చాక దూరమయ్యాడా..! అని సెటైర్లు వేస్తున్నారట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. టెక్కలి వైసీపీ ఇంఛార్జ్ ఎమ్మెల్సీ దువ్వాడ!…