కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది.. కొన్ని సార్లు ప్రత్యేక డ్రైవ్ ద్వారా విస్తృతంగా వ్యాక్సిన్ వేస్తున్నారు అధికారులు.. అయితే, బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో మరికొన్ని రోజులు వ్యాక్సినేషన్‌కు సెలవులు ప్రకటించారు అధికారులు.. రేపు అనగా 14వ తేదీన వాక్సినేషన్ కు సెలవు ఇవ్వాలని వైద్య, ఆరోగ్య సిబ్బంది ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.. ఈ మేరకు, 14వ తేదీన వాక్సినేషన్ కార్యక్రమానికి విరామం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను…
దసరా వార్ లో ముగ్గురు యంగ్ హీరోలు పోటీకి సిద్ధమయ్యారు. వారాంతం వచ్చేసింది. అలాగే ఈ వారాంతంలోనే దసరా కూడా ఉండడంతో సినీ ప్రేక్షకులకు, అలాగే మేకర్స్ కు కలిసొచ్చింది అని చెప్పొచ్చు. శుక్రవారం బాక్స్ ఆఫీస్ వద్ద దసరా సందడి మొదలు కానుంది. ఈ వీకెండ్ దసరా కూడా ఉండడంతో విడుదల కాబోతున్న మూడు సినిమాలకు మంచి న్యూస్ అని చెప్పొచ్చు. మహా సముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్లి సందడి సినిమాలు ఈ సీజన్‌లో…
సుప్రీంకోర్టుకు ఇవాళ్టి నుంచి దసరా సెలవులు వచ్చాయి… ఆ తర్వాత మిలాద్ ఉన్ నబీ సెలవులు కూడా ఉండడంతో ఈ నెల 19వ తేదీ వరకు కోర్టు మూతపడనుంది.. అయితే, శనివారం నుంచే సెలవులు ప్రారంభం అయ్యాయని చెప్పవచ్చు.. శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కాగా ఇవాళ్టి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. ఇక, 17న ఆదివారం, 18, 19 తేదీల్లో మిలాద్ ఉన్ నబీ సెలవులు ఉండడంతో.. సుప్రీంకోర్టు…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ గేమ్ షో “ఎవరు మీలో కోటీశ్వరులు”. ప్రారంభం నుంచీ షోకు పెద్దగా రేటింగ్ రాకపోవడంతో ఈ పండగకు ఎలాగైనా షోకు మంచి రేటింగ్ వచ్చేలా హైప్ పెంచాలని చూస్తున్నారు మేకర్స్. అందుకే ఈ షోకు రాజమౌళి, సమంత, మిల్కీ బ్యూటీ తమన్నా వంటి స్టార్స్ ను స్పెషల్ గెస్టులుగా తీసుకొస్తున్నారు. ఇలాంటి స్టార్స్ షోలో పాల్గొంటున్నారని వార్తలు వస్తున్నప్పటి నుంచీ వాళ్ళు గేమ్ ఎలా ఆడతారు ? హోస్ట్…
దేశరాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు.. దసరా, దీపావళి పండగల సందర్భంగా దేశ రాజధానిలో తీవ్రవాదుల దాడులు జరగవచ్చని ఢిల్లీ పోలీసులకు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.. దీంతో.. అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు. ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు.. ఢిల్లీ పోలీస్ కమీషనర్ రాకేష్ ఆస్తానా నేతృత్వంలో జరిగిన పోలీసు ఉన్నతాధికారుల సమయంలో ఐబీ హెచ్చరికలపై చర్చించారు.. తీవ్రవాదులు దాడులకు స్థానిక క్రిమినల్స్, గ్యాంగ్ స్టర్ల సహకారం తీసుకునే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులకు అప్రమత్తం చేశారు…
దేశంలో గ్యాస్ ధరలు ఇటీవలే మరోసారి పెరిగిన సంగతి తెలిసిందే. వంట గ్యాస్‌పై రూ.15 పెంచారు. గ్యాస్‌ను బుక్‌చేసుకునే విధానంను బట్టి క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటిస్తున్నాయి సంస్థలు. పేటీయం ద్వారా గ్యాస్ బుక్ చేసుకుంటే రూ.800 వరకు క్యాష్‌బ్యాక్ వచ్చేది. అయితే ఇప్పుడు క్యాష్‌బ్యాక్ ఆఫర్ కాకుండా మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది పేటీయం. పేటీయం ద్వారా గ్యాస్ బుక్ చేసుకున్న వారికి ఉచితంగా బంగారాన్ని ఇవ్వబోతున్నది. దసరా, దీపావళి సంద్భంగా ఈ ఆఫర్‌ను ప్రకటించింది. పేటీయం…
దసరా వచ్చింది అంటే పల్లెలకు, సొంత ఊర్లకు వెళ్లేందుకు ప్రజలు ఆసక్తి చూపుతుంటారు. నగరాలు, పట్టణాలను వదిలి సొంత ప్రాంతాలకు వెళ్తుంటారు. కరోనా కారణంగా గత సంవత్సం దసరా వేడుకలు మూగబోయాయి. అయితే, ఈ ఏడాది దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా రవాణా వ్యవస్థలు కూడా దారుణంగా నష్టపోయాయి. దీంతో ఇప్పుడు ఆయా సంస్థలు కూడా అదనపు ఛార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టాయి. కాగా, ఇప్పుడు, ఇండియన్ రైల్వేలు కూడా భారీ మొత్తంలో ఛార్జీలు…
నాగశౌర్య – రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’.. దసరా కానుకగా అక్టోబర్ 15న రానుంది. అయితే తాజాగా ఈ చిత్రం దసరా రేసు నుంచి తప్పుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ పండక్కి పెద్ద సినిమాలు లేకున్నా.. మిగితా సినిమాల క్యూ ఎక్కువే అవ్వడంతో వరుడు కావలెను వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. మహాసముద్రం సినిమా అక్టోబర్ 14న, అక్టోబర్ 15న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్లిసందD సినిమాలు రానున్నాయి. దీంతో వరుడు కావలెను నవంబర్…
పండుగలు వచ్చాయంటే చాలు.. పట్టణాల్లో స్థిరపడినవారు సైతం.. తాను పుట్టిన ప్రాంతానికి వెళ్లడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.. దీంతో, రద్దీ పెరిగిపోతోంది.. అయితే, రానున్న దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.. ప్రత్యేకంగా 4 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.. ఈ బస్సులు ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఇక, పండుగన సీజన్‌లో ప్రత్యేక బస్సులను…