దసరా వార్ లో ముగ్గురు యంగ్ హీరోలు పోటీకి సిద్ధమయ్యారు. వారాంతం వచ్చేసింది. అలాగే ఈ వారాంతంలోనే దసరా కూడా ఉండడంతో సినీ ప్రేక్షకులకు, అలాగే మేకర్స్ కు కలిసొచ్చింది అని చెప్పొచ్చు. శుక్రవారం బాక్స్ ఆఫీస్ వద్ద దసరా సందడి మొదలు కానుంది. ఈ వీకెండ్ దసరా కూడా ఉండడంతో విడుదల కాబోతున్న మూడు సినిమాలకు మంచి న్యూస్ అని చెప్పొచ్చు. మహా సముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్లి సందడి సినిమాలు ఈ సీజన్‌లో విడుదలవుతున్నాయి. వీటిలో ‘మహా సముద్రం’పై భారీ అంచనాలు ఉన్నాయి. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ట్రైలర్ ప్రేక్షకులలో మంచి బజ్‌ను సృష్టించాయి. ఈ చిత్రం గురువారం విడుదలవుతోంది.
Read Also : రిగ్గింగ్ అంటూ అనసూయ ట్వీట్… ‘మా’ ఎన్నికల అధికారి రియాక్షన్
ఇక అఖిల్ గత కొన్ని సంవత్సరాలుగా విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన రేపు విడుదల కానున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. బొమ్మరిల్లు బాస్కర్ దర్శకుడు, పూజా హెగ్డే కథానాయిక. ట్రైలర్, పాటలు యువతను బాగా ఆకట్టుకున్నాయి. పూజా హెగ్డే గ్లామర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. మరి ఈ చిత్రం అఖిల్ కు ఆశించిన విజయాన్ని అందిస్తుందా ? అనేది ఆసక్తికరంగా మారింది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాతో యూత్ ను గట్టిగానే టార్గెట్ చేశాడు. ఈ ప్రయత్నం ఫలించి ఆయన బౌన్స్ బ్యాక్ అవుతారేమో చూడాలి. ఈ సినిమా విషయం అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ ఇద్దరికీ చాలా ముఖ్యం.
ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు “పెళ్లి సందడి”తో గతంలో లాగా మళ్ళీ మ్యాజిక్ చేయబోతున్నాను అని నమ్మకంగా ఉన్నారు. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీ లీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరోహీరోయిన్లు ఇద్దరూ దాదాపుగా కొత్తవారే అయినప్పటికీ ధైర్యంగా దసరా బరిలో దిగారు. ఈ చిత్రంతో రోషన్ ను హీరోగా నిలబెడతానని రాఘవేంద్ర రావు శపథం చేశారు. ఈ చిత్రం శుక్రవారం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘మహా సముద్రం’తో ఢీ కొంటుంది. ఈ దసరా సీజన్‌లో తెలుగు సినిమాలో ట్రయాంగిల్ పోరు ఉంటుంది. మరి ఇందులో తగ్గేదెవరో ? నెగ్గేదెవరో ? చూడాలి.