Balakrishna: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. రోజుకో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు బెజవాడ కనకదుర్గమ్మ. ఇంద్రకీలాద్రిపై ఆరో రోజుకి చేరుకున్నాయి దసరా మహోత్సవాలు.. ఈ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శమనిస్తున్న దుర్గమ్మ ను దర్శించుకున్నారు సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు దుర్గగుడి అధికారులు.. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు బాలయ్య.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ…
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గ అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణరెడ్డి దర్శించుకున్నారు. ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ వారి ఆధ్వర్యంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించే ఊరేగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
Vijayawada: విజయవాడలోని ప్రసిద్ధ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆదివారం ఈవో రామ్ చంద్ర మోహన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో సెక్యూరిటీ సదుపాయాల లోపం కనిపించడంతో ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ఏఈఓ చంద్రశేఖర్‌ను క్లూ లైన్ల పరిశీలన సమయంలో కనిపించకపోవడంతో ఆయనకు చార్జ్ మెమో జారీ చేశారు. అంతేకాదు, అంతరాలయం ఎదుట ఉన్న హుండీని తొలగించాల్సిందిగా రెండుసార్లు ఆదేశించినా అధికారులు పట్టించుకోకపోవడాన్ని ఈవో తప్పుబట్టారు.…
ఆషాఢ మాసంలో అమ్మవారికి ఆషాఢ మాసపు సారె ఇస్తారు అని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం ఈఓ రామారావు తెలిపారు. ఆలయంలోని ఆరవ అంతస్తులో ఆషాఢ మాసపు సారెకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సారె ఇచ్చిన వారికి అమ్మవారి దర్శనాన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
విజయవాడ ఇంద్రకీలాద్రికి పైకి భవానీలు పోటెత్తారు. జై దుర్గా జై జై దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి మార్మోగిపోతుంది. ఇవాళ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దుర్గదేవీ అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. ఓం టర్నింగ్ నుంచి అమ్మవారి సన్నిధానం వరకు క్యూలైన్ లలో భక్తులు వేచి ఉన్నారు.
Kanaka Durga Temple: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి పాలకమండలి సమావేశం ముగిసింది.. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు.. చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.. వేసవి దృష్ట్యా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ చేయాలని నిర్ణయించామని తెలిపారు చైర్మన్ కర్నాటి రాంబాబు.. అన్నదాన భవనం, ప్రసాదం పోటుకి త్వరలోనే టెండర్లకు ఆహ్వానిస్తున్నాం.. దీనిపై నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఇక, సాయంత్రం సమయంలోనూ అన్నదానం నిర్వహించాలని నిర్ణయించాం.. భక్తుల…
Snake in Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన బెజవాడ దుర్గమ్మ ఆలయంలో పాము కలకలం సృష్టిచింది.. దుర్గగుడిలో ఉచిత క్యూలైన్‌లోకి పాము పిల్ల వచ్చింది.. కిటికీలో నుంచి క్యూలైన్‌లోకి కట్ల పాము వచ్చినట్టు చెబుతున్నారు.. అయితే, పాము చూసిన భక్తులు.. భయంతో పరుగులు తీశారు.. క్యూలైన్‌లో ఉన్న భక్తులు పామును చూసి వణికిపోయారు.. కొందరు కేకలు వేశారు.. అయితే, వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది.. కర్ర సాయంతో పామును కిటికీలో నుంచి బయటకి పంపించారు.. ప్రమాదం తప్పడంతో…