Kanaka Durga Temple: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి పాలకమండలి సమావేశం ముగిసింది.. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు.. చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.. వేసవి దృష్ట్యా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ చేయాలని నిర్ణయించామని తెలిపారు చైర్మన్ కర్నాటి రాంబాబు.. అన్నదాన భవనం, ప్రసాదం పోటుకి త్వరలోనే టెండర్లకు ఆహ్వానిస్తున్నాం.. దీనిపై నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఇక, సాయంత్రం సమయంలోనూ అన్నదానం నిర్వహించాలని నిర్ణయించాం.. భక్తుల సూచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు.. మరోవైపు.. భక్త జన దర్బార్ ప్రతి నెలా రెండవ గురువారం నిర్వహించాలని నిర్ణయించామని పేర్కొన్నారు.. దాతలకు నెలకు ఒకసారి అంతరాలయ దర్శనం కల్పిస్తున్నాం అన్నారు. కొండపై భాగంలో విధంగా కొండ దిగువున పొంగళ్ల షెడ్డు ఏర్పాటుకు పాలకమండలి ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా సుఖ, సంతోషాలతో ఉండాలని మే 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు విజయవాడలో మహాయగ్నం నిర్వహిస్తున్నాం అని వెల్లడించారు చైర్మన్ కర్నాటి రాంబాబు..