Vijayawada: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని ఈనెల 25న మూసివేయనున్నారు. సూర్యగ్రహణం కారణంగా ఈనెల 25న ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సూర్యగ్రహణం సందర్భంగా ఈనెల 25న ఉదయం 10 గంటలకు అమ్మవారికి మహానివేదన, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలను అర్చకులు మూసివేస్తారని తెలిపారు. తిరిగి మరుసటి రోజు అమ్మవారి ఆలయ ద్వారాలను తెరవనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. Read Also:…
విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిని పొగాకు నిషేధిత ప్రాంతంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రకటించారు. ఈనెల 26 నుంచి ఆలయ పరిసర ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఆలయ మెట్ల భాగం నుంచి కొండపై వరకు పొగాకు ఉత్పత్తులు నిషేధించినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులు, భక్తులు నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.20 నుంచి 200 వరకు ఫైన్ వసూలు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆలయ పరిసరాల్లో పొగాకు నిషేధిత సర్క్యులర్‌ను స్వయంగా…
బెజవాడ దుర్గగుడిలో ఏసీబీ దాడులు ఎవరికి షాక్ ఇచ్చాయి? పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై వేటు ఎవరికి మింగుడుపడటం లేదు? జరుగుతున్న పరిణామాలపై సన్నిహితుల దగ్గర అసహనం వ్యక్తం చేస్తున్న అమాత్యుల వారు ఎవరు? ఏసీబీ దాడులు.. మంత్రి శిబిరంలో కలకలం! దుర్గమ్మ చల్లని చూపు తమ మీద పడితే లైఫ్ హ్యాపీగా సాగిపోతుందని భావిస్తారు బెజవాడ జనం. రాజకీయ నేతలు సైతం అదే ఆశిస్తారు. అలాంటి అమ్మవారి ఆలయాన్ని ఏసీబీ బృందాలు మూడు రోజులు జల్లెడ పట్టడంతో…