భారతదేశంలో అత్యంత ముఖ్యమైన, ఉల్లాసంగా జరుపుకునే పండుగలలో దసరా ఒకటి. తొమ్మిది రోజులపాటు శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని ఆరాధించే నవరాత్రులు ముగిసిన పదవ రోజున ఈ పండుగను జరుపుకుంటారు.
Indrakeeladri: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటల సమయానికి సుమారు 85 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇప్పటి వరకు 10 రోజుల్లో మొత్తం 11 లక్షల 28 వేల 923 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని దుర్గగుడి ఈవో వీకే శీనానాయక్ తెలిపారు.
Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలోని పాలము జిల్లాలో దుర్గాపూజ జాతరకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఇద్దరు దళిత బాలికలపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంతో వెలుగులోకి వచ్చింది.
క్షణికావేశంలో చేసిన తప్పులు కారణంగా వారంతా జైల్లో మగ్గుతున్నారు. రక్త సంబంధాలకు దూరంగా నాలుగు గోడల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. వారికి ఓ పండుగ ఉండదు. ఓ ఆనందం ఉండదు. అక్కడే తింటూ.. ఆ నలుగురితోనే ఉంటూ ధీనమైన బతుకును జీవిస్తుంటారు.
బంగ్లాదేశ్‌కు మహ్మద్ యూనస్ నాయకత్వం వహించినప్పటి నుంచి పలు మార్లు హిందువులను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు. ఇటీవల వరదలకు భారత్ కారణమని నిందించినట్లు సమాచారం.
బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ సలహాదారు మహ్మద్ జహంగీర్ ఆలం చౌదరి మాట్లాడుతూ.. దుర్గాపూజ వేదికల కారణంగా ముస్లిం అనుచరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. వారి నమాజ్ ప్రారంభానికి ఐదు నిమిషాల ముందు లౌడ్ స్పీకర్లు బంద్ చేయాలని కోరారు.
Bank Holidays: మరో మూడో రోజుల్లో అక్టోబర్ నెల వచ్చేస్తోంది. ఇక పండుగ సీజన్‌లో అక్టోబర్ నెల చాలా కీలకం. ఎందుకంటే ఈ నెలలో అధిక పండుగలు ఉంటాయి. అంతేకాదు ఈ నెలలోనే దసరా పండుగ కూడా ఉంది. ఇక సెలవుల జాతర వచ్చినట్లే.
Bangladesh: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల గొడవలు హింసాత్మకంగా మారి, చివరకు షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చేలా చేశాయి. హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత అక్కడ మతోన్మాదులు హిందువులను టార్గెట్ చేసి దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. హిందూ వ్యాపారాలను, ఆలయాలను తగలబెట్టారు. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ఆ దేశంలో హిందువుల పరిస్థితి చక్కబడుతోంది.
Padma Hilsa: భారతీయులకు, ముఖ్యంగా బెంగాలీలకు బంగ్లాదేశ్ తీపి కబురు చెప్పింది. దుర్గాదేవీ నవరాత్రి ఉత్సవాలకు బంగ్లాదేశ్ గిఫ్టు ఇవ్వబోతోంది. పద్మా పులస(పద్మా హిల్సా) చేపల ఎగుమతికి ఓకే చెప్పింది. దుర్గాపూజ సీజన్‌కి ముందు 4000 మెట్రిక్ టన్నలు హిల్సా చేపలను విక్రయించడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం బుధవారం వ్యాపారులకు అనుమతి ఇచ్చింది. భారతీయ చేపల వ్యాపారుల ద్వారా ఈ రోజు రాత్రికి దేశానికి చేరుకుంటుంది.
Durga Puja: దేశవ్యాప్తంగా దసరా నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. మహాత్మా గాంధీని అసురుడిగా చూపిస్తూ కోల్కతాలోని కస్బాలో ఏర్పాటు చేసిన దుర్గా మండపంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.