Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలోని పాలము జిల్లాలో దుర్గాపూజ జాతరకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఇద్దరు దళిత బాలికలపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంతో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అక్టోబరు 11వ తేదీన జరిగినప్పటికీ ఆదివారం సాయంత్రం ప్రాణాలతో బయటపడిన బాలికలు జరిగిన విషయిన్ని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో బాధితుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిందని సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (చతర్‌పూర్) అవధ్ యాదవ్ పేర్కొన్నారు.
Read Also: MechanicRocky : ట్రైలర్ డేట్ వచ్చింది.. సినిమా రిలీజ్ డేట్ మారింది..
ఇక, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు దళిత బాలికలు సరైదిహ్‌లోని దుర్గా మాత జాతరకు హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా ఆరుగురు నిందితులు వారిని మార్గమధ్యంలో ఆపి అత్యాచారినికి పాల్పడ్డారు. ఇక, బాలికలు ఎలా గోలా ఇంటికి చేరుకుని తమ కుటుంబ సభ్యులకు తమ బాధను వివరించారు అని చెప్పుకొచ్చారు. అయితే, తొలుత పంచాయితీ స్థాయిలో ఈ వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేసేందుకు ప్రయత్నించగా బాలికలు ఫిర్యాదు చేసేందుకు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కంప్లైంట్ అందిన తర్వాత విచారణ ప్రారంభించినట్లు మరో పోలీసు అధికారి వెల్లడించారు. ఆరుగురు నిందితుల్లో గ్రామ పెద్ద కొడుకుతో సహా నలుగురిని అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.