Durga Puja In Bangladesh: దుర్గాపూజపై ఆంక్షలు.. నమాజ్ ప్రారంభానికి ముందే లౌడ్‌స్పీకర్లు బంద్
- దుర్గాపూజలపై ఆంక్షలు విధిస్తున్న బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం..
- నమాజ్ ప్రారంభానికి ఐదు నిమిషాల ముందే లౌడ్‌స్పీకర్లు బంద్ చేయాలి..
- ముస్లింలకు ఇబ్బంది కలగకుండా హిందువుల పండగ చేసుకోండి: మహ్మద్ జహంగీర్ ఆలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Durga Puja In Bangladesh: బంగ్లాదేశ్‌లో కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం దుర్గా పూజల నిర్వహణకు పలు ఆంక్షలు విధిస్తుంది. బంగ్లాదేశ్‌లో దుర్గాపూజల కోసం 32 వేల 666 వేదికలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహ్మద్ మొయినుల్ ఇస్లాం మాట్లాడుతూ.. గత కొంతకాలంగా మత అల్లర్ల జరుగుతున్నాయి.. వీటిని దృష్ట్యాలో ఉంచుకుని.. దేశంలో మరింత కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దుర్గాపూజలు మొదలుకొని, విగ్రహ నిమజ్జనం వరకు మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా.. ఉండేందుకు సైబర్ నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే, అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా నేషనల్ ఎమర్జెన్సీ సర్వీస్ 999కి డయల్ చేసి సమాచారం ఇవ్వొచ్చని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహ్మద్ మొయినుల్ చెప్పారు.
Read Also: Ambati Rambabu: జగన్ తిరుమల పర్యటన రద్దుకు ప్రభుత్వమే కారణం..
Also Read
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
- US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
- India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
- Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
కాగా, బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ సలహాదారు మహ్మద్ జహంగీర్ ఆలం చౌదరి మాట్లాడుతూ.. దుర్గాపూజ వేదికల కారణంగా ముస్లిం అనుచరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. వారి నమాజ్ ప్రారంభానికి ఐదు నిమిషాల ముందు లౌడ్ స్పీకర్లు బంద్ చేయాలని కోరారు. బంగ్లాదేశ్ మత వ్యవహారాల సలహాదారు అబుల్ ఫైజ్ ముహమ్మద్ ఖలీద్ హుస్సేన్ మాట్లాడుతూ.. హిందువుల భద్రతకు తాము హామీ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. అక్టోబరు 3వ తేదీ నుంచి దుర్గాపూజలు స్టార్ట్ కానున్నాయి. అక్టోబర్ 12న ముగుస్తాయి. అక్టోబర్ 8, 9 తేదీలలో పెద్ద సంఖ్యలో భక్తులు దుర్గాపూజలకు హాజరు కానున్నారు.
తాజావార్తలు
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
ట్రెండింగ్
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!