Off The Record: తెలంగాణలోని హాట్ సీటుల్లో దుబ్బాక నియోజకవర్గం కూడా ఒకటి. 2018 ఎన్నికల వరకు ఇదో సాధారణ సెగ్మెంటే అయినా… తర్వాత జరిగిన ఉపఎన్నికతో ఎక్కడలేని హైప్ వచ్చేసింది. దాంతో దుబ్బాకలో చీమ చిటుక్కుమన్నా.. ఏ పార్టీలో ఏం జరిగినా హాట్ టాపిక్‌గా మారుతోంది. తాజాగా దుబ్బాక కాంగ్రెస్‌లో నడుస్తున్న మూడు ముక్కలాట పార్టీలో గందరగోళానికి దారితీస్తోందనే వాదన వినిపిస్తోంది. ఎవరికివారు టికెట్ తమకే అని ప్రచారం చేసుకుంటున్నారు. దుబ్బాక కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా ఉన్న…
OFF The Record: ఆయన బీజేపీలో కీలక నేత. ఉపఎన్నికలో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. తన వాగ్ధాటితో ఎదుటివారిని కట్టడి చేసే ఆయనకు.. సొంత నియోజకవర్గంలో పార్టీ నేతల తీరు ఓ పట్టాన మింగుడు పడటం లేదు. అసమ్మతి పేరుతో నిర్వహిస్తున్న రహస్య సమావేశాలు వేడి రాజేస్తున్నాయి. అదెక్కడో.. ఆ నాయకుడు ఎవరో ఈ స్టోరీలో చూద్దాం. దుబ్బాక బీజేపీలోని సీనియర్లు ఎందుకు రహస్యంగా భేటీ అయ్యారు? కాషాయ శిబిరంలో ఎందుకు కలకలం? ప్రస్తుతం టీ బీజేపీలో…
తెలంగాణలో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాల పేలుడు వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు ఇంధన ధరల పెరుగుదల.. మరోవైపు పర్యావరణ హితం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తే ఇలాంటి ఘటనలు వాటిని కొనుగోలు చేయాలనుకున్న మిగతా వారిలో భయాన్ని పుట్టిస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండంల పెద్ద చీకోడు గ్రామంలో ఛార్జింగ్ పెట్టిన ఓ ఎలక్ట్రిక్ వాహనంలో బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో ఎవరికీ ఏం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక…
టీఆర్ఎస్‌కు పట్టున్న నియోజకవర్గాల్లో దుబ్బాక ఒకటి. గులాబీ పార్టీ నుంచి సోలిపేట రామలింగారెడ్డి వరసగా విజయం సాధిస్తూ వచ్చారు. అంతకుముందు ఈ నియోజకవర్గం దొమ్మాటగా ఉండేది. అప్పుడు కూడా సోలిపేట రెండుసార్లు గెలిచారు. గత ఏడాది సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ తరఫున రామలింగారెడ్డి భార్య సుజాత పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఓటమితో సుజాత కొద్దిరోజులు సైలెంట్ అయ్యారు. కానీ.. ఇప్పుడిప్పుడే ఆమె యాక్టివ్ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో…
సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. అందులో ఉన్న వారితో పాటు…వారిని రక్షించేందుకు…బావిలోకి దిగిన గజ ఈతగాడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. శాయశక్తుల కష్టపడి.. బావిలో పడిన కారును బయటకు తీసే క్రమంలో అందులోనే చిక్కుకుపోయాడు. ఆరు గంటలు శ్రమించి… చివరకు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన గజ ఈతగాళ్లు.. క్రేన్ సాయంతో కారును బయటకు తీయగా.. అందులో తల్లీకొడుకుల మృతదేహాలు బయటపడ్డాయి. మెదక్…