మద్యం సేవించి వాహనం నడపడం చాలా ప్రమాదకరమైన చర్య. మద్యం మనం కళ్లతో చూస్తున్నదానిపై కూడా ప్రభావం చూపుతుంది, మన మస్తిష్కాన్ని, నాడీ వ్యవస్థను క్రమంగా ప్రభావితం చేస్తుంది. ఇది మన అవగాహనను తగ్గించి, మనం తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది.
నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో తాగిన మైకంలో మితిమీరిన వేగంతో కార్ నడుపుతూ ఒకరి మరణానికి కారణమయ్యారు యువకులు. కూకట్ పల్లిలోని ఒక హాస్టల్ లో నాగర్ కర్నూల్ నలుగురు బ్యాచిలర్ యువకులు ఉంటున్నారు. ఒక యువకుడి పుట్టినరోజు సందర్భంగా… ఫుల్ గా మధ్యం సేవించి కాల్ సెంటర్ కు చెందిన Xylo కార్ లో చార్మినార్ కు వెళ్లి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ క్రమంలో…
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన మహిళను తప్పించేందుకు వాహనాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఇతర వాహనాలను ఢీకొట్టి పారిపోయిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని స్టడీ సర్కిల్ సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన మహేంద్ర థార్ (టీఎస్08జేజెడ్4566)ను ఆపారు. కారు నడిపిస్తున్న మహిళకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయగా…
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిబంధనల ఉల్లంఘనలపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్య ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. నిబంధనలు ఉల్లంఘిస్తూ పలువురు వాహనదారులు పట్టుబడ్డారు.
తెలంగాణలో రోజు రోజుకు డ్రంకెన్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. జల్సాల కోసం మద్యం సేవించి రోడ్లపై వాహనాలు నడుపుతూ ఎంతో మంది జీవితాలను బలిగొంటున్నారు. కుటుంబాలకు పెద్దదిక్కైన వారు ప్రమాదాల్లో చిక్కుకోవడంతో వారినే నమ్ముకున్న వారి జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. అయితే డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. పోలీసులు, ఎక్సైజ్, వైద్య నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతేకాకుండా…
ట్రాఫిక్ పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్న మందుబాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాగడం రోడ్డు ఎక్కడం ప్రమాదాలను కొని తెచ్చుకోవడం వారికి పరిపాటిగా మారింది. దీని ఫలితంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఫలితంగా వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. నగరంలో మితిమీరి పోతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు. నిన్న ఒక్కరోజే డ్రంకెన్ డ్రైవింగ్ కారణంగా నలుగురు మృతి చెందారు. మూడు కమిషనరేట్ల పరిధిలోనూ డ్రంకన్ డ్రైవ్ ప్రమాదాలు పెరుగుతున్నాయి.…
డ్రంకెన్ డ్రైవ్ లో వాహనాలను సీజ్ చేయవద్దని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పోలీసులకు ఆదేశించారు. ఈ మేరకు కమిషనరేట్ మినీ కాన్ఫరెన్స్‌హాల్లో ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో ట్రాఫిక్ ఉన్నతాధికారులు, సిబ్బందితో సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదాలను గణనీయంగా తగ్గించడానికి కృషి చేయాలన్నారు. ట్రాఫిక్ అవగాహన సమావేశాలు పెంచాలన్నారు. పాదచారుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని రోడ్డు…