నగరంలో పెరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రాఫిక్ పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్న మందుబాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాగడం రోడ్డు ఎక్కడం ప్రమాదాలను కొని తెచ్చుకోవడం వారికి పరిపాటిగా మారింది. దీని ఫలితంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఫలితంగా వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. నగరంలో మితిమీరి పోతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు. నిన్న ఒక్కరోజే డ్రంకెన్ డ్రైవింగ్ కారణంగా నలుగురు మృతి చెందారు. మూడు కమిషనరేట్ల పరిధిలోనూ డ్రంకన్ డ్రైవ్ ప్రమాదాలు పెరుగుతున్నాయి.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 242 మంది మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 2020 లో 189 మంది మృతి చెందారు. సైబరాబాద్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 232 మంది మరణించారు. తాగి వాహనాలు నడిపిన వారిపై సైబరాబాద్‌లో 32, 828 కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా సైబరాబాద్‌లో ఈ ఒక్క ఏడాదే 210 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా తెలంగాణ మొదటి స్థానంలో ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 1,328 ప్రమాదాలు చోటు చేసుకోగా, తాగి వాహనాలు నడిపిన కారణంగా గతేడాదిలో తెలంగాణలో 343 మంది మరణించారు.
Also Read
డ్రంక్ అండ్ డ్రైవ్‌ల ప్రమాదాలు ఎక్కువగా వీఐపీ జోన్‌లోనే జరుగుతుండటం గమనార్హం. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, ఓఆర్‌ఆర్‌లపైనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. నగర శివార్లతో పాటు సిటీ సెంటర్‌లోనూ ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. తాగిన మత్తులో స్పీడ్‌గా వెళ్తున్న మందుబాబులు. తాగిన వ్యక్తులు డ్రైవర్ లేకుండా పబ్బు నుంచి వెళ్లొద్దని పోలీస్ శాఖ ఆదేశాలు ఉన్నప్పటికీ మందుబాబులు బేఖాతరు చేస్తున్నారు. ఒకవేళ తాగి వెహికల్ నడిపి ప్రమాదానికి గురైతే పబ్‌లదే బాధ్యత అని గతంలో పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. 12 పబ్‌లపై కేసు నమోదు చేసిన పోలీసులు. గచ్చిబౌలి, మాదాపూర్‌లో ఉన్న పబ్‌లపైనే కేసులు నమోదు చేశారు. తాగి డ్రైవ్ చేసే వాళ్లకు పబ్‌లు డ్రైవర్‌ను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
-
Alias Rukmini : నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!