Drunken Drive : డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన మహిళ.. తప్పించబోయి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన మహిళను తప్పించేందుకు వాహనాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఇతర వాహనాలను ఢీకొట్టి పారిపోయిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని స్టడీ సర్కిల్ సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన మహేంద్ర థార్ (టీఎస్08జేజెడ్4566)ను ఆపారు. కారు నడిపిస్తున్న మహిళకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. దీంతో కారును పక్కకు పార్క్ చేయాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
కాగా పక్కసీటులో కూర్చున్న వ్యక్తి తాను కారును పక్కకు తీస్తానంటూ డ్రైవింగ్ సీట్లోకి వచ్చాడు. కారును వేగంగా వెనక్కి తీస్తూ బైక్‌ను ఢీకొట్టాడు. దాంతో ట్రాఫిక్ పోలీసులు అడ్డుకునేందుకు యత్నించగా వేగంగా ముందుకు దూకిస్తూ బారికేడ్లను ఢీకొట్టడంతో పాటు అడ్డుగా వచ్చిన ట్రాఫిక్ హోంగార్డు దుర్గారావును ఢీకొట్టడంతో పాటు అక్కడినుంచి కారుతో సహా పారిపోయాడు. ఈ మేరకు హోంగార్డు దుర్గారావు ఇచ్చిన ఫిర్యాదుతో కారు నడిపిన వ్యక్తిపై ఐపీసీ 332,353,279 రెడ్‌విత్ 34తో పాటు 184 ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా కారు బందుగల శివాలీరెడ్డి పేరుతో రిజిస్టర్ అయినట్లు పోలీసులు గుర్తించారు.
తాజావార్తలు
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!