Drunk and Drive: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెడతారా?.. పీఎస్ ముందు మందుబాబు ఆత్మహత్యాయత్నం!
- అర్ధరాత్రి మోటార్ సైకిల్‌పై వెళ్తూ హల్చల్
- డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసిన పోలీసులు
- కేసు పెడతారా అంటూ పీఎస్ ముందు మందుబాబు ఆత్మహత్యాయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nalgonda Man Attempts Suicide at Police Station: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదవడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని ఓ మందుబాబు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం అర్ధరాత్రి జరిగింది. సమయానికి హోమ్ గార్డ్, కానిస్టేబుల్ మంటలను ఆర్పి.. ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ మందుబాబు నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అతడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.
సోమవారం అర్ధరాత్రి రావిళ్ల నరసింహా అనే వ్యక్తి పూటుగా మద్యం సేవించాడు. రాత్రి 11 గంటల సమయంలో నల్గొండ నగరంలోని రెహమాన్ బాగ్ ప్రాంతంలో మోటార్ సైకిల్‌పై వెళ్తూ హల్చల్ చేశాడు. నరసింహాను చూసిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. టెస్టులో ఆల్కహాల్ 155 రీడింగ్ నమోదయింది. దీంతో నరసింహాపై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. తనపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఎలా బుక్ చేస్తారంటూ మందుబాబు పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
Also Read
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
- Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
- Ram Lakshman Masters: 'ది ప్యారడైజ్' సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
- Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
కాసేపటి తర్వాత నరసింహా పోలీస్ స్టేషన్‌లోకి వచ్చాడు. తన ఒంటిపై అప్పటికే పెట్రోల్ పోసుకొని ఉన్నాడు. స్టేషన్‌లోకి ప్రవేశించగానే గేటు వద్ద ఉన్న హోంగార్డు ప్రవీణ్ అడ్దకుని.. ఎవరు అంటూ నరసింహాను ప్రశ్నించాడు. నరసింహా తాను వెంట తెచ్చుకున్న లైటర్‌తో నిప్పు అంటించుకున్నాడు. ఒక్కసారిగా మంటలు రావడంతో హోంగార్డు ప్రవీణ్ దూరంగా పరిగెత్తాడు. అక్కడే ఉన్న కానిస్టేబుల్ అంజాత్ స్టేషన్‌లో నుంచి బెడ్ షీట్ తెచ్చి మంటలు ఆర్పాడు. ఆపై వెంటనే ఆస్పత్రికి తరలించారు. నరసింహను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.
తాజావార్తలు
-
Release Postpone : పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?”
-
Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
-
Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!