తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, సైబర్ నేరాలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. దాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యువత అటువైపు అడుగులు వేయకుండా జాగ్రత్తలను తీసుకుంటోంది. విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ సరఫరా కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటుంది.
డ్రగ్స్ వ్యవహారంపై మళ్లీ ఫోకస్ పెట్టారు తెలంగాణ పోలీసులు.. ఇవాళ డ్రగ్స్ పై డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి జంట నగరాల పోలీస్ కమిషనర్లతో పాటు జిల్లా ఎస్పీలు హాజరయ్యారు.. డ్రగ్స్ నియంత్రణకు 1000 మందితో ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించ�