హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతోందా? చాపకింద నీరులా రకరకాల పేర్లతో పబ్ లలో డ్రగ్స్ వాడేస్తున్నారా? అర్థరాత్రిళ్ళు దాగినా పబ్ లలో యువత ఎందుకంత ఎంజాయ్ చేస్తున్నారు? అసలు హైదరాబాద్ కి డ్రగ్స్ ఎలా తెస్తున్నారు? ఎవరు తెస్తున్నారు? పబ్స్ వెనుక జరుగుతున్న గబ్బు పై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బంజారాహిల్స్ లో సంచలనం కలిగించిన పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో సంచలన అంశాలు బయటకు వస్తున్నాయి. పుడింగ్ వింగ్ పబ్ కేసులో విచారణ…
హైదరాబాద్‌లో డ్రగ్స్‌కు బానిసై బీటెక్ విద్యార్థి మృతిచెందడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ దర్యాప్తును వేగవంతం చేసింది. ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న డ్రగ్స్ పెడ్లర్ లక్ష్మీపతి ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏపీలో లక్ష్మీపతిని హెచ్ న్యూ వింగ్ అదుపులోకి తీసుకుంది. అయితే హైదరాబాద్ డ్రగ్ కేసులో లక్ష్మీపతి కోసం ఐదు రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. ఎట్టకేలకు లక్ష్మీపతి ఏపీలో పోలీసులు…
డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం లేదంటోంది కుషిత. నాపై జరుగుతున్న తప్పుడు ప్రచారం ఆపాలని జూనియర్ ఆర్టిస్ట్, షార్ట్ ఫిలిం నటి కుషిత మీడియాను కోరింది. హైదరాబాద్ నగరంలో లేట్ అవర్స్ పబ్ లో ఉండడం మా తప్పు కాదన్నారు జూనియర్ ఆర్టిస్ట్, షార్ట్ ఫిలింనటి కుషిత. అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారు అన్న విషయం మాకు తెలియదు. తెలిస్తే మేము అక్కడికి ఎందుకు వెళ్తాము…? అక్కడ రష్ ఎక్కువగా ఉన్నమాట వాస్తవం. డ్రగ్స్ అక్కడ వినియోగిస్తున్నారని మాకు…
హైదరాబాద్ బంజారాహిల్స్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసుపై పోలీసులు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. గత రెండు నెలలుగా డ్రగ్స్ విషయంలో అనేక కేసులు నమోదు చేశామని.. పబ్స్‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి డెకాయ్ ఆపరేషన్ చేస్తున్నట్లు తెలిపారు. ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లను కలిగి ఉన్న అన్నింటికీ మెసేజ్‌లు ఇచ్చామన్నారు. గత రాత్రి పబ్‌లో రాడిసన్ గ్రూప్ వారు అనుమతి తీసుకుని…
శనివారం అర్ధరాత్రి జరిగిన హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ పబ్ ఘటనపై ప్రముఖ నటుడు నాగబాబు స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో తన కుమార్తె నిహారిక పబ్‌లోనే ఉన్నట్లు స్పష్టంగా చెప్పారు. ఓ వైపు పోలీసుల విచారణ జరుగుతుండగా.. పబ్‌లో జరిగిన పార్టీలో డ్రగ్స్ విరివిగా వాడారన్నది స్పష్టం అయిన నేపథ్యంలో నిహారిక ఆ పార్టీలో ఉండటానికి కారణం చెప్పకుండా పోలీసులు నిహారిక తప్పులేదని చెప్పారంటూ నాగబాబు చెప్పడం వివాదాస్పదం అవుతోంది. నిహారిక గురించి ‘షీ…
హైదరాబాద్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న రాడిసన్ పబ్ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారిని అరెస్ట్ చేసే దమ్ము కేసీఆర్‌కు ఉందా అని ఆయన సవాల్ విసిరారు. ఈ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు ఉన్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఆ పేర్లన్నీ తాను వెల్లడిస్తానని.. దమ్ముంటే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ డ్రగ్స్ కేసులో ఎవరైనా బీజేపీ నేతలు ఉంటే వారిని…
తెలంగాణలో సంచలనం కలిగించిన డ్రగ్స్ మరణం కేసుకి సంబంధించి నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ కీలక దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో వెలుగు చూస్తున్న అంశాలు అధికారులనే విస్మయానికి గురిచేస్తున్నాయి. తొలి డ్రగ్స్ మరణానికి సంబంధించిన కేసులో లక్ష్మీపతి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. లక్ష్మీపతి కోసం మూడు నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. గోవా, అరకు, విశాఖ, తణుకులో లక్ష్మి పతి తలదాచుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబీకులతో…
డ్రగ్స్ కి బానిసలవుతున్న విద్యార్ధుల్ని ఆ మురికికూపం నుంచి బయటపడేసేందుకు పోలీసులు కఠినచర్యలకు దిగుతున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ కు బానిసై ప్రాణాలు కోల్పోయిన బీటెక్ విద్యార్థి మరణంలో అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. నల్లకుంట పోలీస్ ల అదుపులో ముగ్గురు డ్రగ్స్ వాడుతున్న వ్యక్తులు వున్నారని తెలుస్తోంది. సాప్ట్ వేర్ ఉద్యోగి రామకృష్ణ, గిటార్ టీచర్ నిఖిల్ జాషువా , బీటెక్ విద్యార్థి జీవన్ రెడ్డి లను కోర్టులో హాజరు పరుచనున్నారు పోలీసులు. పరారీలో ఉన్న…
టాలీవుడ్ డ్రగ్స్ కేసు మలుపులు తిరుగుతోంది. ఈడీ కోర్ట్ ధిక్కరణ పిటీషన్ తో ముందు కొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈడీ అడిగిన అన్ని వివరాలు ఇచ్చేసింది ప్రభుత్వం. డిజిటల్ రీకార్డ్స్ ,కాల్ డేటా, ఎఫ్ఎస్ఎల్ నివేదిక లను ఈడీ కి అందించినట్లు తెలిపింది ప్రభుత్వం. ఈడీ అడిగిన వివరాలు ఇచ్చినట్లు హైకోర్టు రిజిస్టర్ కు మెమో దాఖలు చేసింది ప్రభుత్వం. చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్పరాజ్ అహ్మద్ పై హైకోర్టులో కోర్టు…
సంచలనం కలిగించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలకాంశాలు బయటకు వస్తున్నాయి. ఈడీ దాఖలుచేసిన కోర్టీ ధిక్కరణ పిటిషన్ విచారణకు రానుంది. కెల్విన్ కూల్ ప్యాడ్ లో సినీతారల చిట్టా ఉందని ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. సమగ్ర దర్యాప్తు వివరాలు ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలను పాటించడంలేదని ఈడీ కోర్టుకి తెలిపింది. సినీతారల కాల్ రికార్డ్స్ ఎక్సైజ్ శాఖ కోర్టుకు సమర్పించలేదని ఈడీ పేర్కొంది. ఇప్పటి వరకు ఆరు లేఖలు వ్రాసినా వివరాలు ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖ ససేమిరా…