ముంబైకి చెందిన ఓ యువనటి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. భోజ్‌పురిలో ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తున్న యువనటి డిసెంబర్ 20న తన స్నేహితులతో కలిసి ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కు పార్టీకి వెళ్లింది. అక్కడకు ఎన్‌సీబీ అధికారుల పేరుతో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆమెను బెదిరించారు. డ్రగ్స్ కేసులో పేరు వెల్లడించకుండా ఉండాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదే పదే ఫోన్ చేసి భయపెట్టడంతో మనస్తాపానికి గురై యువనటి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. Read Also:…
సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు బండారు హన్మంత్ కోర్టులో లొంగిపోయాడు. ఎల్బీనగర్ కోర్టులో హన్మంత్ లొంగిపోయినట్టు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లాలో పట్టుబడిన డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడుగా హన్మంత్ వున్నాడు. ఇటీవల మేడ్చల్ జిల్లాలో రూ.2 కోట్ల విలువైన మెఫిడ్రిన్ పట్టుకున్న సంగతి తెలిసిందే. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని ఇస్నాపూర్‌లో డ్రగ్స్ తయారుచేస్తున్నట్లు గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చాటున డ్రగ్స్ తయారుచేస్తున్నాడు హన్మంత్ రెడ్డి. నిందితుడిని కస్టడీలోకి తీసుకునేందుకు బాలానగర్ పోలీసుల…
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ రావడంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ తరఫున బాంబే హైకోర్టులో సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదించారు. దేశంలో ఆయన చాలా ఫేమస్ లాయర్. అటార్నీ జనరల్‌గానూ పనిచేశారు. ఈ నేపథ్యంలో ముకుల్ రోహత్గీ వంటి లాయర్ వాదించబట్టే ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ వచ్చిందని దర్శకుడు వర్మ అభిప్రాయపడ్డాడు. Read Also:…
కోలీవుడ్ సూపర్ స్టార్ తలపతి విజయ్ ప్రస్తుతం తన తదుపరి డార్క్ థ్రిల్లర్ చిత్రం “బీస్ట్” షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. నెల్సన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా తరువాత విజయ్ 66వ చిత్రం డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనుంది. విజయ్ ఫస్ట్ డైరెక్ట్ మూవీగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీని దిల్ రాజు నిర్మించనున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు ఇది 50వ చిత్రం…
గత కొంత కాలంగా బాలీవుడ్ పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కన్ను ఉంది. తన మన అనే బేధం లేకుండా టాప్ స్టార్స్ నుంచి సామాన్యుల వరకూ డ్రగ్స్ ఇష్యూ బాలీవుడ్ ని కుదిపేస్తోంది. ఇటీవల సంఘటనలతో ఉన్నత స్థాయి బాలీవుడ్ ప్రముఖులలో మరీ ముఖ్యంగా యువ తరం నటీనటుల్లో ఎంతో భయం నెలకొనిఉంది. ఇక ఇదిలా ఉంటే మన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా శుక్రవారం 57వ పుట్టినరోజు…
అక్టోబర్ 21వ తేది, గురువారం దాదాపు నాలుగు గంటల పాటు ఎన్సీబీ అధికారులు బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేను ఆర్యన్ ఖాన్ తో ఉన్న అనుబంధం, డ్రగ్స్ వాడకంపై తమ కార్యాలయంలో విచారించారు. దానికి ముందు ఆమె సెల్ ఫోన్ ను, లాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. అలానే ఆర్యన్ తో అనన్య గతంలో చాటింగ్ చేసిన విషయాలను ఎన్సీబీ అధికారులు ఈ సందర్భంగా ఆమె దగ్గర ప్రస్తావించినట్టు తెలుస్తోంది. విశేషం ఏమంటే… ఆర్యన్, అనన్య…
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగానే ఈరోజు ఉదయం ఎన్సీబీ నటుడు చుంకీ పాండే కుమార్తె, బాలీవుడ్ నటి అనన్య పాండే ఇంట్లో, షారుఖ్ ఖాన్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. తరువాత అనన్య పాండేను విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది ఎన్సీబీ. సాయంత్రం 4 గంటల సమయంలో ఏజెన్సీ కార్యాలయానికి చేరుకున్న అనన్య పాండేను ఇప్పుడు ఎన్‌సిబి ప్రశ్నిస్తోంది. కొన్ని…
హెటిరో డ్రగ్స్ కట్టల కొద్దీ నగదు బయటపడుతూనే ఉంది . గత మూడు రోజుల నుంచి హెటిరో డ్రగ్స్ చేస్తున్న సోదాల్లో భారీగా నగదును ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు . ఇప్పటివరకు దాదాపు 200 కోట్ల పైచిలుకు సీజ్ చేసినట్లు సమాచారం. ఐటీ అధికారులు సీజ్ చేసిన నగదును లెక్కిస్తున్నారు. కొంత నగదును ఇప్పటికే తగ్గించి లోని కోఠి లోని ఎస్ బి ఐ బ్యాంకు కి తరలించారు. మరోవైపు హెటిరో డ్రగ్స్ సంబంధించి 22…
మత్తు పదార్ధాల అక్రమ రవాణా వ్యవహారంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆదానిపై దేశద్రోహం కేసు పెట్టాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ఇక, మత్తు పదార్థాల రవాణాకు సహకరించిన వారిపైన చర్యలు ఉండాలని డిమాండ్ చేశారు.. రోజుకి వెయ్యికోట్లు సంపాదించడానికి ఆదానీ ఏమైనా మాయల పకీరా..? అంటూ ప్రశ్నించిన ఆయన.. డ్రగ్స్ ఎవరు తయారు చేస్తున్నారు.. ఎవరు సరఫరా చేస్తున్నారు.. వాళ్లను పట్టుకోవాలన్నారు. మానవ బలహీనతను ఆసరాగా చేసుకుని డ్రగ్స్ దందా జరుగుతోందని…
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఎన్సీబీ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది ఎన్సీబీ కోర్టు. ఈనెల 7 వరకు ఆర్యన్ కస్టడీలో ఉంచాలని ఎన్సీబీ అధికారులు కోర్టుకు విన్నవించారు. ఆర్యన్ ఖాన్ మరో మూడు రోజుల పాటు కస్టడీలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ముంబై క్రూయిజ్ రేవ్ పార్టీపై దాడిలో ఎన్సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్…