హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతోందా? చాపకింద నీరులా రకరకాల పేర్లతో పబ్ లలో డ్రగ్స్ వాడేస్తున్నారా? అర్థరాత్రిళ్ళు దాగినా పబ్ లలో యువత ఎందుకంత ఎంజాయ్ చేస్తున్నారు? అసలు హైదరాబాద్ కి డ్రగ్స్ ఎలా తెస్తున్నారు? ఎవరు తెస్తున్నారు? పబ్స్ వెనుక జరుగుతున్న గబ్బు పై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బంజారాహిల్స్ లో సంచలనం కలిగించిన పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో సంచలన అంశాలు బయటకు వస్తున్నాయి.
పుడింగ్ వింగ్ పబ్ కేసులో విచారణ కొనసాగుతోంది. 3 టేబుళ్లపై డ్రగ్స్ వున్నట్టు తెలుస్తోంది. బర్త్ డే కేక్ కట్ చేసిన చోట అనుమానిత పౌడర్ గుర్తించారు పోలీసులు. అక్కడే డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు అనుమానం ఆ టేబుల్స్ బుక్ చేసిన వారి డేటా సేకరించే ప్రయత్నంలో వున్నారు. సీసీటీవీ ఫుటేజ్, కస్టమర్ల లిస్ట్ ఆధారంగా దర్యాప్తు సాగుతోంది.
https://ntvtelugu.com/drugs-pedler-lakshmipathi-arrest/
కాల్ డేటా, వాట్సప్ చాటింగ్స్ వివరాల సేకరణకు యత్నాలు జరుగుతున్నాయి. వాట్సాప్ లో 70 గ్రూపులకు అడ్మిన్ ఎవరు? ఎప్పటికప్పుడు చాటింగ్ డిలీట్ ఎలా చేస్తున్నారు? పోలీసులతోనూ చాటింగ్, సెలబ్రిటీలతో పరిచయాలు… ఇలా అనేక అంశాలు పరిశీలనలో బయటపడుతున్నాయి. అర్జున్ ,కిరణ్ రాజ్ కోసం గాలింపు కొనసాగుతోంది. మూడు టేబుళ్లపై డ్రగ్స్ ఆనవాళ్లు లభ్యం కావడంతో అక్కడే డ్రగ్స్ తీసుకుని వుంటారని తెలుస్తోంది. ఆ రోజు పబ్లో 250 మంది జల్సా చేశారు. పోలీసుల జాబితాలో 148మంది పేర్లు మిగతా 105 మందిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. సీసీటీవీ ఫుటేజీలో స్పష్టత కరవయినట్టు తెలుస్తోంది. పోలీసుల విచారణలో ఇంకెన్ని గమ్మత్తయిన అంశాలు బయటపడతాయో వెయిట్ చేయాల్సిందే.