హైదరాబాద్‌లో డ్రగ్స్‌కు బానిసై బీటెక్ విద్యార్థి మృతిచెందడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ దర్యాప్తును వేగవంతం చేసింది. ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న డ్రగ్స్ పెడ్లర్ లక్ష్మీపతి ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏపీలో లక్ష్మీపతిని హెచ్ న్యూ వింగ్ అదుపులోకి తీసుకుంది. అయితే హైదరాబాద్ డ్రగ్ కేసులో లక్ష్మీపతి కోసం ఐదు రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. ఎట్టకేలకు లక్ష్మీపతి ఏపీలో పోలీసులు పట్టుకున్నారు. అయితే బీటెక్ విద్యార్థి మృతిలో లక్ష్మీపతి కీలక సూత్రధారి.
ఏడేళ్లుగా లక్ష్మీపతి గంజాయికి బానిసైన లక్ష్మీపతి.. బీటెక్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడే గంజాయికి అలవాటు పడ్డాడు. స్టూడెంట్‌గా ఉన్నప్పుడే గంజాయి, డ్రగ్స్ అమ్మిన లక్ష్మీపతి.. ఏజెన్సీ ప్రాంతం నుంచి ఆశిష్ ఆయిల్ తెచ్చి అమ్మేవాడని పోలీసులు వెల్లడించారు. రూ.లక్షకు లీటర్ ఆశిష్ ఆయిల్ కొనుగోలు చేసిన లక్ష్మీపతి.. హైదరాబాద్‌లో లీటర్ ఆశిష్ ఆయిల్‌ని రూ.8లక్షలకు అమ్మేవాడని విచారణ తేలినట్లు పోలీసులు తెలిపారు. ప్రేమ్‌కుమార్, లక్ష్మీపతి కలిసి డ్రగ్స్ అమ్మకాలు జరిపేవారని, గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి విద్యార్థులకు లక్ష్మీపతి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.
https://ntvtelugu.com/ts-pecet-2022-notification-released/