డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం లేదంటోంది కుషిత. నాపై జరుగుతున్న తప్పుడు ప్రచారం ఆపాలని జూనియర్ ఆర్టిస్ట్, షార్ట్ ఫిలిం నటి కుషిత మీడియాను కోరింది.
హైదరాబాద్ నగరంలో లేట్ అవర్స్ పబ్ లో ఉండడం మా తప్పు కాదన్నారు జూనియర్ ఆర్టిస్ట్, షార్ట్ ఫిలింనటి కుషిత. అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారు అన్న విషయం మాకు తెలియదు. తెలిస్తే మేము అక్కడికి ఎందుకు వెళ్తాము…? అక్కడ రష్ ఎక్కువగా ఉన్నమాట వాస్తవం. డ్రగ్స్ అక్కడ వినియోగిస్తున్నారని మాకు తెలీదు! మా ఫ్రెండ్స్ పార్టీ అయ్యాక బయటకి వెళదామని అనుకునే లోపే పోలీసులు వచ్చారని ఎన్టీవీ లైవ్ లో కుషిత పేర్కొంది.
అందరినీ బాధ్యులను చేయడం….పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం సరికాదు !పోలీసులు వచ్చారు మా డిటైల్స్ తీసుకున్నారు…! మేము పోలీసులకు సహకరించం అన్నారు. కావాల్సి వస్తే మా రక్త నమూనాలు (శాంపిల్స్) తీసుకోండి , మేము ఎప్పుడైనా శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధమే. దీనిని అడ్డు పెట్టుకొని ఇలా చేయడం సరికాదు. మీడియా వాళ్లు కొంచం సమన్వయం పాటించాలి. పబ్ కి వచ్చిన వాళ్ళని అందరిని బద్నామ్ చేయడం సరికాదు. మేము ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో ఎదుగుతున్నాం అన్నారు కుషిత. మమ్మల్ని ఇలా బద్నామ్ చేయడం సరి కాదు..! 150 మంది పబ్ లో ఉన్నవారందరిపై ఇలా ద్రుష్పచారం చేయడం సరి కాదన్నారు. అందరి రక్త నమూనాలు తీసుకొని ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారు వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. మేం కూడా సహకరిస్తాం. ఇలాంటి దృష్ప్రచారం వల్ల మా కుటుంబసభ్యులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు.
అక్కడ పబ్ అర్ధరాత్రి వరకు నడిపించే వారి పై చర్యలు తీసుకోండి..! మేము జస్ట్ ఆఫ్టర్ పార్టీకి వెళ్ళాం. దయచేసి మీడియా వారు మమ్మల్ని బద్నాం చేయవద్దని కుషిత ఎన్టీవీ లైవ్ లో ప్రాధేయపడింది.