భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ హైదరాబాద్ రానున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని ఆమె ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి తన సందేశాన్ని వినిపిస్తారు.
దేశ ప్రథమ పౌరురాలు ఢిల్లీ మెట్రోలో (Delhi Metro) ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒక సామాన్యురాలిలో ప్రయాణికులతో కలిసి కూర్చుని జర్నీ చేయడంతో ప్యాసింజర్స్ అంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.
పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. 83 ఏళ్ల బన్వరీలాల్.. వ్యక్తిగత కారణాల చేత తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
President Droupadi Murmu Speech in Budget Session 2024: కొత్త పార్లమెంట్ భవనంలో ఇదే తన తొలి ప్రసంగం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. తెలంగాణలో సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతోందన్నారు. భారత సంస్కృతి, సభ్యత చైతన్యవంతమైనదని కొనియాడారు. ఆదివాసీ యోధులను స్మరించుకోవడం గర్వకారణం అని, చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలిదేశంగా భారత్ రికార్డు సాధించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 2024 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం అయ్యాయి.…
బడ్జెట్ సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. నారీశక్తిని కేంద్రం ప్రతిబింబిస్తుందన్నారు. జనవరి 26న కర్తవ్యపథ్‌లో నారీశక్తి ఇనుమడించిందని ఆయన పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి ఉదయం 11 గంటలకు సెషన్స్ ప్రారంభం కానుండగా తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రారంబోపాన్యాసం చేయబోతున్నారు.
నేడు తెలంగాణ పర్యటనకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తున్నారు. శీతాకాల విడిదికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ఆమె రాబోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు చోట్ల ఇవాళ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీష్ పాలనలో భారతదేశంలో సూదీ కూడా తయారుచేయలేదని నెహ్రూ పెద్ద పెద్ద కంపెనీలను స్థాపించారని, ఆటమిక్ ఎనర్జీ ప్లాంటులను కూడా స్థాపించారన్నారు. ఐఐటీలను, ఐఐఎం ల స్థాపనకు కృషి చేశారని కొనియాడారు. ఎర్రకోటలో నిర్వహించిన వేడుకలకు దూరంగా ఉన్న ఆయన ఎక్స్ ద్వారా తన సందేశాన్ని అందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.…