ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బలోపేతం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
పదిహేను రోజుల్లో మేం ఒక డ్రోన్ పాలసీని తెస్తామని ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. అమరావతిలో జరుగుతోన్న దేశంలోనే అతిపెద్ద డ్రోన్ సమ్మిట్ 2024ను కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుతో కలిసి ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 15 రోజుల్లోనే డ్రోన్ పాలసీ తీసుకొస్తాం.. ఓర్వకల్లు, కర్నూలు ప్రాంతంలో ఒక డ్రోన్ తయారీ కేంద్రంగా తీసుకురావాలన్నారు.. అన్ని ప్రధాన నగరాలకు కర్నూలు-ఓర్వకల్లు హబ్ దగ్గరలో ఉంటుందన్నారు..
డ్రోన్ రంగంలో దిశా నిర్దేశం చేసేలా సదస్సు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సాంకేతిక యుగంలో డేటా గొప్ప ఆస్తి అని డ్రోన్ కార్పొరేషన్ సమీక్షలో సీఎం చంద్రబాబు అన్నారు. డ్రోన్ సమ్మిట్‌లో యువత, విద్యార్థులు ఎక్కువ మంది భాగస్వామ్యం వహించేలా ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
రేపు, ఎల్లుండి డ్రోన్ సమ్మిట్ సీకే కన్వెన్షన్‌లో జరుగుతోందని ఏపీ ప్రభుత్వ సెక్రటరీ సురేష్ పేర్కొన్నారు. నాలుగు కేటగిరీలలో రిజిస్ట్రేషన్ ఆన్ లైన్‌లో చేశామన్నారు. డెలిగేట్స్, డ్రోన్, హ్యాకథాన్, స్పీకర్స్ కేటగరీల కింద రిజిస్ట్రేషన్లు చేశామని చెప్పారు. 6929 రిజిస్ట్రేషనులు వచ్చాయని.. రెండు రోజుల క్రింద రిజిస్ట్రేషన్లు ఆపేశామన్నారు.
ఈ నెల 22-23 వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న అమరావతి డ్రోన్ సమ్మిట్-2024కు ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. రెండు రోజుల సదస్సు సరిగే మంగళగిరి సీకే కన్వెన్షన్‌లోనూ, ఇటు 22వ తేదీ సాయంత్రం విజయవాడ కృష్ణానది తీరాన ఉన్న పున్నమీ ఘాట్ వద్ద మెగా డ్రోన్ షో నిర్వహణకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.
ఈనెల 22,23 తేదీల్లో మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 విజయవంతానికి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈమేరకు డ్రోన్ సమ్మిట్ ఏర్పాట్లపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి వివిధ శాఖల కార్యదర్శులు,ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
అమరావతి డ్రోన్ సమ్మిట్‌పై వివిధ శాఖల సెక్రెటరీలు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 22, 23 తేదీలలో అమరావతి డ్రోన్ సమ్మిట్ జరగనుంది.
ఏపీలో ఈ నెల 22, 23 తేదీల్లో జరుగనున్న అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను ఈ జాతీయ సెమినార్ నిర్వహణ భాగస్వామిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి రూ.5.54 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని పేర్కొంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.