AP Deputy CM: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందనీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే నిధులను ఇందు కోసం సద్వినియోగం చేసుకొందామన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ, స్థానిక వైద్య సిబ్బంది పటిష్టమైన చర్యలు తీసుకోవడం వల్ల విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా అదుపులోకొచ్చిందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆయన వివరాలతో కూడిన సమాచారం అందించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు డయేరియా ప్రబలిన వెంటనే పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతిని విజయనగరం జిల్లాకు హుటాహుటిన పంపించామనీ, అక్కడే ఉండి పరిస్థితిని ఆమె…
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో తాగు నీటి సమస్య పరిష్కారం దిశగా అడుగులుపడ్డాయి. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇటీవల కంకిపాడులో జరిగిన ‘పల్లె పండుగ’ ప్రారంభ కార్యక్రమంలో తన నియోజకవర్గంలోని మూడు మండలాల్లోని 43 గ్రామాల్లో తాగునీటి కలుషిత సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తెచ్చారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపురంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పర్యటించారు. నెల్లూరు నగరానికి తాగునీటిని అందించే పథకాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలలో ఇంటింటికి తాగునీరు ఇచ్చేందుకు ప్రణాళికను రూపొందించామని తెలిపారు.
మానవులకు నీరు అత్యంత ముఖ్యమైనది. ఆరోగ్యంగా ఉండాలంటే తగిన మోతాదులో నీరు తాగాలి. ఇది రోజంతా మన శరీరానికి తాజాదనాన్ని అందిస్తుంది. తగినంత నీరు తాగకపోవడం వల్ల మన శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీంతో.. కడుపు సమస్యలు మొదలవుతాయి. తక్కువ నీరు త్రాగడం వలన శరీరం, మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది.
KTR: యాభై ఏళ్లు హైదరాబాద్ లో నీటికి ఇబ్బంది రాకుండా కేసీఆర్ ముందు చూపుతో ఈ సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తి చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.