ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ రోడ్లు, తాగునీటి సరఫరాపై సోమవారం నాడు అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక ఆదేశాల్ని జారీ చేశారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో జరిగిన ఈ సమీక్షలో.. రోడ్ల మరమ్మతులతో పాటు కొత్త రోడ్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని జగన్ సూచించారు. టెండర్లు పూర్తి చేసి, జూన్ నెలాఖరులోపు పనులు పూర్తి చేయాలన్నారు. అలాగే తాగునీటి సరఫరా పనులకు కీలక ప్రాధాన్యం ఇవ్వాలని…
నాగార్జున సాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీరు విడుదల చేస్తోన్న తెలంగాణ తీరుపై ఏపీ అభ్యంతరం తెలిపింది. విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ చేస్తోన్న నీటి విడుదలను అడ్డుకోవాలని కేఆర్ఎంబీకి లేఖ రాశారు ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణ రెడ్డి. లేఖలో ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ కోరారు. వేసవిలో తాగు నీటి అవసరాలకు లేకుండా విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ నీటిని దుర్వినియోగం చేస్తోంది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కోసం ముందస్తు అనుమతి లేకుండా నాగార్జునసాగర్…
ఏపీలోని విజయవాడలో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఛలో విజయవాడ పేరుతో అనేక ప్రాంతాల నుంచి ఉద్యోగులు తరలివచ్చి ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పీఆర్సీ జీవోలపై ఆందోళన నిర్వహించారు. అయితే ఈ ఆందోళనలో బెజవాడ ఆడపడుచులు తమ వంతు సహకారం అందించారు. భారీ స్థాయిలో తరలివచ్చిన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడ మంచినీటి బిందెలు ఏర్పాటు చేసి ఉద్యోగుల దాహర్తి తీర్చారు. ఈ సందర్భంగా తమ ఆందోళనల పట్ల విజయవాడ మహిళలు…
మనిషికి నీరు ఎంత అవసరమో చెప్పాల్సిన అవసరం లేదు. ఆహారం లేకుండా కొన్నిరోజులు జీవించవచ్చు. కానీ, నీరు లేకుండా ఎక్కవ సమయం జీవించలేవు. దట్టమైన మంచు ప్రాంతాల్లో నివశించినా, ఎడారి ప్రాంతాల్లో నివశిస్తున్నా దాహంవేసినపుడు తప్పనిసరిగా నీరు తీసుకోవాల్సిందే. మంచీనీళ్ల కోసం మనిషి చాలా డబ్బులు ఖర్చుచేస్తుంటారు. ఇలాంటి మంచినీటిని గత 30 ఏళ్లుగా అక్కడ టాయిలెట్లకోసం వినియోగిస్తున్నారట. ఈ విషయం ఇటీవలే బయటపడింది. జపాన్‌లోని ఒకాసా విశ్వవిద్యాలయంలోని ఆసుపత్రిలో టాయిలెట్ల కోసం మామూలు వాటర్‌కు బదులుగా…
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో ఈనెల 29, 30 తేదీల్లో తాగునీటి సరఫరాకు ఆటంకం కలగనుంది. మంజీరా ఫేజ్-2 పైపులైన్‌లకు మరమ్మతులు నిర్వహిస్తున్న కారణంగా నీటి సరఫరా బంద్ కానుందని జలమండలి ప్రకటించింది. కలగ్గూర్ నుంచి పటాన్ చెరువు వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్‌పీ పంపింగ్ పైప్‌లైనుకు సంబంధించి వివిధ ప్రాంతాలలో లీకేజీలను నివారించేందుకు మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల…
భాగ్యనగర వాసులకు నీటి కష్టాలు తప్పేలా లేవు. తాగునీటికి సంబంధించి జలమండలి భాగ్యనగర వాసులకు కీలక సూచనలు చేసింది. హైద్రాబాద్ మహా నగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న మంజీరా డ్రికింగ్ వాటర్‌సప్లై స్కీం(ఎండబ్యూ ఎస్‌ఎస్) ఫేజ్-2లో కలాబ్‌గుర్ నుంచి పటాన్ చెరువు వరకు 1500 ఎంఎండయాపీఎస్‌సీ పంపింగ్ మెయిన్‌లైన్‌కు వివిధ ప్రాంతాల్లో లీకేజీల నివారణకు మరమ్మత్తులు, కందిగ్రామం వద్ద జంక్షన్ పనులు చేపట్టనుంది. ఈ కారణంగా భాగ్యనగరంలో పలు చోట్ల వివిధ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం…
మంచినీటి కుళాయి విషయంలో చెలరేగిన వివాదం కత్తులతో యుద్ధం చేసేదాకా వెళ్లిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకొంది. జిల్లాలోని బూర్జ మండలం ఉప్పినవలస గ్రామంలోని పాతరెల్లివీధిలో మంచి నీటి విషయంలో చెలరేగిన గొడవతో కత్తులతో రెచ్చిపోయింది ఓ వర్గం. నాలుగు రోజుల క్రితం మంచినీటి కుళాయి వద్ద ఇద్దరు యువకులు కత్తులతో వీరంగం సృష్టించారు. తమ కుటుంబసభ్యులు తప్ప వేరే ఎవరూ నీరు పట్టుకోకూడదని ఆ యువకులు బెదిరించారు. కాగా, మరోమారు మంచినీటి కుళాయి వద్ద ఇరువర్గాలు…
భూమిపై తెలివైన జంతువు మనిషి. మనిషితో పాటుగా కొన్ని రకాల జంతువులు కూడా తెలివైనవే. పరిస్థితులకు అనుగుణంగా ఆయా జంతువులు వ్యవహరిస్తుంటాయి. అడవిలో ఉండే జంతువులకు దాహం వేస్తే సాధారణంగా నదులు, చెరువుల వద్దకు వెళ్లి దాహం తీర్చుకుంటాయి. అయితే, మహారాష్ట్రలోని గడ్చిరౌలిలోని కమలాపూర్ లో ఏనుగుల కోసం ప్రభుత్వం ఓ శిభిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ శిభిరంలో వందలాది ఏనుగులు ఆశ్రయం పొందుతున్నాయి. ఈ శిభిరంలో ఉన్న ఆడ ఏనుగు ఒకటి దాహం తీర్చుకోవడానికి చెతిపంపు…