నేటి జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్ల వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు సర్వసాధారణమైపోయాయి. వాటి వల్ల గుండెలో మంట, నెర్వస్ నెస్, రెస్ట్ లెస్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. దీనిని నివారించడానికి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. రోజూ రాత్రిపూట ఒక గ్లాసు సెలరీ జ్యూస్‌ను తాగితే.. అనేక సమస్యల నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
పార్టీ, ఫంక్షన్ ఇలా వేడుక ఏదైనా కూల్ డ్రింక్స్ తాగేస్తుంటారు. ఇలా ఇష్టమైన డ్రింక్స్ తాగుతుంటే.. ఆ మజానే వేరుంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ వీటిని ఎంతో ఇష్టంగా తాగుతారు. అయితే.. అలాగే అలవాటైతే మీ శరీరంలో ఉన్న కాలేయం దెబ్బ తినే అవకాశం ఉంది. అవును, మీరు విన్నది నిజమే.. మీ కాలేయానికి చాలా హాని కలిగించే, కాలక్రమేణా కాలేయ వ్యాధులను కలిగించే కొన్ని పానీయాలు ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఓ వింత కేసు వెలుగు చూసింది. మహిళా పోలీస్ స్టేషన్‌లో నడుస్తున్న ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌లో భార్యాభర్తల మధ్య గొడవ జరగడానికి గల కారణాన్ని విని అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు.
'టీ' అంటే తాగని వారు ఎవరూ ఉండరు. తలనొప్పి ఉన్నా.. పనిలో ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందాలన్నా టీ తాగాల్సిందే. మరీ ముఖ్యంగా ఉదయం లేవగానే ఛాయ్ లేకపోతే.. ఆ రోజంతా తలనొప్పిగా ఉంటుంది. అందుకోసమని వేడి వేడిగా ఒక గ్లాస్ ఛాయ్ తాగితే ఉపశమనం కలిగిస్తుంది. తమ రుచి మరియు ఆరోగ్యాన్ని బట్టి.. గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ, మిల్క్ టీలను తాగుతుంటారు. వీటిలో మిల్క్ టీ అంటే చాలా మందికి ఇష్టం.…
ఓ విద్యార్థికి ఇద్దరు తోటి విద్యార్థులు జ్యూస్లో కలిపిన మూత్రాన్ని తాగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తిరుచిరాపల్లిలోని తమిళనాడు నేషనల్ లా యూనివర్శిటీలో జరిగింది. లా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు తమ క్లాస్‌మేట్‌కు మూత్రంలో జ్యూస్ కలిపి తాగించారు. ఈ కారణంగా యూనివర్సిటీ యాజమన్యం ఆ ఇద్దరు విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేసింది.
ఇప్పుడున్న రోజుల్లో ఇంట్లో తయారుచేసే ఆహారం కంటే.. బయట తినే జంక్ ఫుడ్ ఎక్కువ. దీంతో ఊబకాయం, ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, మనుషులలో పెరిగిన పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి అనేక కారణాలు శరీరంలో కొవ్వు పేరుకుపోయే విధంగా చేసి మనల్ని ఊబకాయ బాధితులుగా మారుస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో.. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. అలాంటప్పుడు వ్యాయామం కానీ.. సరైన ఆహారాన్ని కానీ తీసుకోవాలి. విపరీతంగా…
బీహార్‌లోని ఔరంగాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నలుగురు స్నేహితులు కలిసి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం హరిహరగంజ్ కు తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం.. ఔరంగాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. వారి పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. మళ్లీ అక్కడి నుండి గయాలోని మగద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. ఇక్కడ చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా,…
కొబ్బరి నీరు తాగడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు, అమినో యాసిడ్స్, ఎంజైములు, విటమిన్ సి ని కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి నీళ్ల వినియోగం రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఓ మహిళ ఒక్కరోజులో తాగాల్సిన నీరు ఒకేసారి తాగింది.. ఆ తర్వాత ప్రాణాల మీదకు తెచ్చుకుంది.. ఆ తర్వాత ఇంకేముంది ఆ మహిళ చనిపోయింది. అయితే ఆమే తాగిన నీరు విషపూరితం అని రిపోర్టులో తేలింది.