కలలు కనడం ప్రతి మనిషిలోనూ సహజంగా వస్తుంటాయి. అయితే కొన్నిసార్లు మనసుకు ఆనందాన్ని, ప్రశాంతతను కలగజేసే కలలు వస్తే.. మరికొన్ని సార్లు ఆందోళనను కలగజేసే స్వప్నాలు వస్తుంటాయి. అందులోనూ పీడకలలు మనస్సులో ఉద్రిక్తతను పెంచుతాయి. స్థిరంగా మీకు పీడకలలు వస్తున్నాయంటే అంది అవాంఛనీయ సంఘటనలకు సంకేతంగా పరిగణించాలి.
నిద్రలో కలలు రావడం ప్రతి ఒకరిలో సాధారణంగానే జరుగుతుంటుంది. అయితే మంచి కలల వల్ల ప్రశాంతంగా నిద్రపోతారు. కానీ పీడ కలలు లేదా భయానక స్వప్నాలు రావడం చెడు అనుభవాన్ని కలిగిస్తాయి. దీని వల్ల భయంతో నిద్రలో నుంచి హఠాత్తుగా మెలకువ వస్తుంది. సాధారణమైన కలల్లో వ్యక్తులు ప్రపంచాన్ని చుట్టి వస్తారు. కానీ పీడ కలల్లో మాత్రం ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. అంతేకాకుండా ఇలాంటి కలల వల్ల అనారోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది.