నిద్రలో కలలు రావడం ప్రతి ఒకరిలో సాధారణంగానే జరుగుతుంటుంది. అయితే మంచి కలల వల్ల ప్రశాంతంగా నిద్రపోతారు. కానీ పీడ కలలు లేదా భయానక స్వప్నాలు రావడం చెడు అనుభవాన్ని కలిగిస్తాయి. దీని వల్ల భయంతో నిద్రలో నుంచి హఠాత్తుగా మెలకువ వస్తుంది. సాధారణమైన కలల్లో వ్యక్తులు ప్రపంచాన్ని చుట్టి వస్తారు. కానీ పీడ కలల్లో మాత్రం ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. అంతేకాకుండా ఇలాంటి కలల వల్ల అనారోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. భయాన్ని కలిగించే కలలు రావడానికి నిర్ధిష్టమైన కారణం ఉంది. ఈ రోజు మనం అలాంటి కలలు.. వాటి వెనకున్న అర్థాలు గురించి తెలుసుకుందాం..
READ MORE: Saiyami Kher: ఏడాదిలో రెండు సార్లు.. తొలి భారతీయ నటిగా ‘సయామీ ఖేర్’ చరిత్ర!
డ్రీమ్స్ సైన్స్ బుక్ ప్రకారం.. నిజానికి జీవితంపై భయం ఉన్నవారు.. రేపు ఏమవుతుందో అనే టెన్షన్ ఉన్నవారికే కలలో దెయ్యాలు కనిపిస్తాయట. దెయ్యాలు, భూతాలు ఉంటాయి అనేది.. మనుషుల నమ్మకాలను బట్టి ఉంటుంది. దేవుడు ఉన్నాడు అని నమ్మిన ప్రతి ఒక్కరు దెయ్యం ఉందని నమ్ముతారు. రోజూ నిద్రలో దెయ్యాలు కనిపిస్తున్నాయి అంటే మాత్రం.. వారు జీవితంలో ఏదో కోల్పోయిన బాధలో ఉన్నారని అర్ధం అంట. కలలో దెయ్యాలు కనిపించడం అనేది చెడు సంకేతం. మీ చుట్టూ నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్లు సంకేతం. మానసికంగా బలంగా లేరని అర్ధం. కొందరు ఎమోషనల్ గా ఉన్నప్పుడు. జీవితంలో ఏదైనా నచ్చింది కోల్పోయినప్పుడు.. ఒకే విషయం గురించి ఆలోచించినప్పుడు కూడా దెయ్యాలు కలలోకి వస్తాయంట. ఇక దెయ్యంతో మీరు పోరాడినట్లు కలలో కనిపిస్తే.. భవిష్యత్ లో మీరు సాధించే విజయానికి ఏదో అడ్డుపడుతున్నట్లు తెలిపే సంకేతమని చెప్తున్నారు. మీ కలలో ఎగిరే దెయ్యం కనిపిస్తే, స్వప్న శాస్త్రం ప్రకారం, శత్రువులు మీకు హాని చేస్తారని అర్థం. మీకు అలాంటి కల వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి.
READ MORE: Bhadrachalam Temple: భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై దాడి!