అంబేడ్కర్ 65వ వర్థంతిని స్మరించుకుంటూ ఆ మహనీయునికి జాతీ మొత్తం ఘన నివాళుర్పిస్తుందని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశమంతటా రాజ్యాంగం ఒకేలా అమలు చేస్తుందన్నారు. కానీ ఏపీలో మాత్రం రాజ్యాంగం రోజు రోజుకు అవహేళనకు గురవుతుందని విమర్శించారు. జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ర్టంలో రాజ్యాంగ విలువలు, హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. సమాజంలో ఉన్న వైషమ్యాలు రూపుమాపాలని డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారన్నారు.…
అంబేద్కర్ ఆలోచనల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ప్రగతి భవన్ లో నివాళులు అర్పించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… స్వతంత్రం వచ్చిన తొలి నాళ్లలోనే అద్భుతమైన దీర్ఘదృష్టితో భారతదేశ భావి భవిష్యత్తు అవసరమైన భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు ఎల్లప్పుడూ అత్యంత ఆదర్శనీయం అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల ఫలితంగానే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్ష అయిన ప్రత్యేక…
భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడారు. అంబేడ్కర్‌తోనే దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు అవకాశాలు లభిస్తున్నాయన్నారు. అంబేద్కర్ ముందు చూపుతోనే మన దేశంలో రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ రిజర్వేషన్లను ఉపయోగించుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆమె పేర్కొన్నారు. కాగా అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వలనే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. వెనుబడిన వర్గాల ప్రజలకు ఇంకా రాజ్యాంగ…
అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని మంత్రి వెల్లంపల్లి అన్నారు. విజయవాడలో… మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్య లక్ష్మి, దేవినేని అవినాష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వెల్లంపల్లి మాట్లాడుతూ… అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించామన్నారు. ఆయన రాజ్యాంగం నేటికి అమలవుతుందంటే అంబేద్కర్ గొప్ప తనం అర్ధమవుతుందని కొనియాడారు. అన్ని వర్గాల వారికి సమ ప్రాధాన్యత ఇస్తూ… అందరి అభిమానాన్ని పొందుతున్నారన్నారు.…
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది 1950 జనవరి 26. రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకుని ఇవాళ్టికి 72 ఏళ్లు పూర్తవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. బ్రిటిషర్ల కబంధ హస్తాలనుంచి మనం బయటపడింది ఆగస్టు 15, 1947 .. కానీ మనల్ని మనం పాలించుకునేందుకు ఒక విధానం లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంగా, ఒక లిఖిత రాజ్యాంగం కలిగి ఉన్న దేశంగా భారత్ గుర్తింపు పొందింది ఆ తర్వాతే. దేశాన్ని ఒకే తాటిపై నడిపించేది రాజ్యాంగం.…
ఎస్సీ, ఎస్టీలకు అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ బీసీలకు రాజ్యాంగం సృష్టిస్తున్నారు.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి నాలుగు రెట్లు ఎక్కువగానే సీఎం జగన్.. బీసీలకు రాజ్యాంగాన్ని సృష్టిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్.. దేశంలో ఏ సీఎం కూడా బీసీలకు రాజ్యాంగం రాయలేదు.. కానీ, బీసీలకు రాజ్యాంగం రాస్తున్న మొట్టమొదటి నాయకుడు వైఎస్ జగన్ అంటూ కీర్తించారు.. బీసీలను తన పక్కన కూర్చొపెట్టుకున్నారు.. మంత్రి పదవులు, ఎంపీ స్థానాలు ఇచ్చి…