గల్ఫ్ దేశంలో మరో విషాదం చోటుచేసుకుంది. మరో భారతీయ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కేరళకు చెందిన అతుల్య శేఖర్ శనివారం తెల్లవారుజామున యూఏఈలోని షార్జా అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది. భర్తే కొట్టి చంపేశాడంటూ బాధితురాలి తల్లిదండ్రులు కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లైన దగ్గర నుంచి వరకట్న వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. అతుల్య శేఖర్ తన 30వ పుట్టిన రోజునే శవమై కనిపించడం బాధిత కుటుంబానికి తీవ్ర విషాదం మిగిల్చింది.
ఇది కూడా చదవండి: Mamata Banerjee: బెంగాల్‌లో రాజకీయ మార్పు దేనికి.. 11 ఏళ్లు ఏం చేశారని మార్పు కావాలి.. మోడీపై మమత ఫైర్
అతుల్య శేఖర్ కేరళలోని కొల్లం నివాసి. 2014లో సతీష్‌తో వివాహం జరిగింది. జూలై 18-19 తేదీల్లో భార్యాభర్తల గొడవ జరిగినట్లు సమాచారం. దీంతో సతీష్.. అతుల్య గొంతు కోసి, కడుపులో తన్నడమే కాకుండా తలపై ప్లేట్‌తో కొట్టడంతో చనిపోయనట్లుగా బాధితురాలి తల్లి ఆరోపించింది. పెళ్లైనప్పటి నుంచి సతీష్ వేధిస్తున్నాడని..తెచ్చిన కట్నం సరిపోలేదని తిడుతూ ఉండేవాడని వాపోయింది. పెళ్లి సమయంలో 40 తులాల బంగారం, బైక్ ఇచ్చినట్లుగా తెలిపారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు సతీష్‌పై కేరళ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఇక ఈనెల ప్రారంభంలో షార్జాలో కేరళ మహిళ పసి బిడ్డతో సహా చనిపోయింది. ఆమె భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతలోనే మరో విషాదం చోటుచేసుకోవడంతో కేరళీయులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
ఇది కూడా చదవండి: Sonam Raghuvanshi: జైల్లో నెలరోజులు పూర్తి చేసుకున్న సోనమ్.. వెలుగులోకి ఆసక్తికర విషయాలు!