ఏపీలో భారీ వర్షాల కారణంగా రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితుల సహాయార్థం జోలె పట్టి విరాళాలను సేకరించాలని పార్టీ శ్రేణులకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు పిలుపునిచ్చారు. వరద ప్రభావిత జిల్లాలలో బాధితులను ఆదుకునేందుకు ఈనెల 25, 26 తేదీల్లో విరాళాల సేకరణకు కార్యాచరణ రూపొందించినట్లు సోము వీర్రాజు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా విరాళాలను సేకరిస్తామని, ప్రజలు నగదు, వస్తు రూపంలో విరాళాలను అందజేయవచ్చని…
దేశవ్యాప్తంగా 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి అత్యధిక విరాళాలు సేకరించిన ప్రాంతీయ పార్టీలలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అగ్రస్థానంలో నిలిచింది. టీఆర్ఎస్ పార్టీకి విరాళాల రూపంలో రూ.89 కోట్లు వచ్చినట్లు ఏడీఆర్ అనే సంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) రెండో స్థానంలో ఉంది. టీడీపీకి విరాళాల రూపంలో రూ.81 కోట్లు వచ్చాయి. అటు ఏపీలో అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీకి విరాళాల రూపంలో రూ.74 కోట్లు సమకూరినట్లు ఏడీఆర్ తెలిపింది. దేశవ్యాప్తంగా…
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 125 కిలోల బంగారాన్ని విరాళాలుగా సేకరించాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు భారీ ఎత్తున స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి చామకూర మల్లారెడ్డి భారీ విరాళాలను యాదాద్రి ఆలయ స్వామివారికి సమర్పించారు. ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయడం కోసం మేడ్చల్ నియోజకవర్గం నుంచి సేకరించిన రూ.1.83 కోట్లను గురువారం నాడు యాదాద్రి ఆలయ ఈవోకు అందజేశారు. ఈ నగదుతో మూడున్నర కిలోల బంగారం సమకూరుతుంది. Read Also: తెలంగాణలో…