Greenland: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. వచ్చీరావడంతోనే ఏడాపెడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేస్తున్నాడు. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అక్రమ వలసల బహిష్కరణ, బర్త్ రైట్ పౌరసత్వం వంటి కీలక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత, పనామా కాలువుతో పాటు గ్రీన్‌ల్యాండ్ తమ దేశంలో భాగం కావాలని కోరుకున్నారు. గ్రీన్‌ల్యాండ్‌ని అమెరికా నియంత్రణలోకి తీసుకురావడానికి సైనిక జోక్యాన్ని తోసిపుచ్చడానికి నిరాకరించడం ద్వారా ఒక హెచ్చరిక చేశారు.
అయితే, ట్రంప్ వాదనలపై డెన్మార్క్ దేశంలో స్వయంప్రతిపత్తి కలిగిన గ్రీన్ ల్యాండ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సొంత భవిష్యత్తుని పణంగా పెట్టుకోవాలని, అమెరికన్‌లుగా మారాలని కోరుకువడం లేదని మంగళవారం అన్నారు. ‘‘మేము గ్రీన్‌ల్యాండ్ వాసులు. మేము అమెరికన్లుగా ఉండటానికి ఇష్టపడము. మేము కూడా డానిష్‌గా ఉండటానికి ఇష్టపడము. గ్రీన్‌ల్యాండ్ భవిష్యత్తును గ్రీన్‌ల్యాండ్ నిర్ణయిస్తుంది’’ అని ప్రధాన మంత్రి మ్యూట్ ఎగేడ్ విలేకరుల సమావేశంలో అన్నారు. గ్రీన్‌ల్యాండ్ క్లిష్ట పరిస్థితులను ప్రస్తుతం ఎదుర్కొంటోందని చెప్పారు.
Read Also: Saif Ali Khan Case: సైఫ్ అలీ ఖాన్ కేసులో కొత్త అప్డేట్.. అందుకే దాడి!
ట్రంప్ తన ప్రమాణస్వీకార ప్రసంగంలో గ్రీన్ ల్యాండ్ గురించి ప్రస్తావించకపోయినా.. ఆ తర్వాత ఓవర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో స్పందించారు. ‘‘గ్రీన్‌ల్యాండ్ ఒక అద్భుతమైన ప్రదేశం, అంతర్జాతీయ భద్రత కోసం మాకు అది అవసరం’’ అని అన్నారు. డెన్మార్క్ గ్రీన్‌ల్యాండ్‌ని తప్పకుండా ఇస్తుందని మాకు తెలుసు అని, దానిని నిర్వహించడానికి వారికి చాలా డబ్బు ఖర్చు అవుతోందని ఆయన అన్నారు. డెన్మార్ విదేశాంగ మంత్రి లార్స్ లోకే రాస్ముస్సేన్ మంగళవారం మాట్లాడుతూ.. ఏ దేశం కూడా మరొక దేశానికి తమంతట తాము సాయం చేసుకోకూడదని అన్నారు.
డెన్మార్క్ ప్రధాని మెస్టే ఫ్రెడెరిక్సెన్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. యూరప్ కొత్త వాస్తవికత వైపు వెళ్లాలని అని అన్నారు. గ్రీన్లాండ్ ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కును గమనిస్తూనే, డెన్మార్క్ అమెరికాతో పొత్తు కొనసాగించాల్సిన అసవరాన్ని ఆమె నొక్కి చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి డెన్మార్క్‌కి అమెరికా స్నేహం చాలా ముఖ్యమైందిగా అభివర్ణించారు.