ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా డోన్ మండలం కమలాపురం గ్రామంలో అందరినీ కలిచివేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వ్యక్తి గత నాలుగేళ్లలో గ్రామంలోని సుమారు 80 పశువులకు విషమిచ్చి చంపేశాడు. అతను నిశ్శబ్దంగా ప్రజల ఇళ్లలోని పశువుల కొట్టంలోకి ప్రవేశించి, ఆవులు, ఎద్దులకు విషం పెట్టి అక్కడి నుంచి పారిపోయే వాడు. గ్రామంలో పశువులకు అంటువ్యాధి వచ్చిందని మొదట్లో ప్రజలు అనుకున్నారు. దీంతో ఆవులు, ఎద్దులు ఒక్కొక్కటిగా చనిపోతున్నాయని అభిప్రాయపడ్డారు. ఓ రైతు ఇంట్లో…