Pak-Afghan: ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ మధ్య టర్కీలో జరుగుతున్న శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో రెండు దేశాలు మరోసారి యుద్ధానికి దగ్గరగా చేరాయి. చర్చలు విఫలమైనట్లు ఇరు దేశాలు స్టేట్ మీడియా వెల్లడించింది. చర్చలు విఫలమైతే ఆఫ్ఘాన్‌పై దాడులు చేయడం తప్పా వేరే మార్గం లేదని ఇటీవల పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు.
Israel: 9/11 దాడుల తర్వాత అమెరికా ఏం చేసింది, తాము కూడా అదే చేస్తున్నామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాపై అమెరికా స్పందించినట్లే తాము ఖతార్ రాజధాని దోహాలోని హమాస్ పొలిటికల్ బ్యూరోపై దాడులు చేశామని సమర్థించుకున్నారు. ఖతార్, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న ఇతర దేశాల వారిని బహిష్కరించాలని లేదా వారిని న్యాయం ముందు నిలబెట్టాలని ఆయన అన్నారు. ‘‘మీరు అలా చేయకుంటే మేము చేస్తాం’’ అని నెతన్యాహూ అన్నారు. అంతర్జాతీయంగా…
PM Modi: హమాస్ పొలిటకల్ బ్యూరో నాయకులే లక్ష్యంగా ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. అయితే, ఈ దాడులను ప్రధాని నరేంద్రమోడీ ఖండించారు. దాడిపై విచారం వ్యక్తం చేస్తూ, తీవ్ర ఆందోళన తెలియజేశారు. తాను ఈ విషయమై ఖతాన్ ఎమిర్‌తో మాట్లాడానని, ఖతార్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడాన్ని ఖండించానని, వివాదాలు పరిష్కరించుకోవడానికి చర్చించుకోవాలని పిలుపునిచ్చినట్లు ప్రధాని మోడీ తెలిపారు. Read Also: CPL 2025 Robbery: తుపాకీతో బెదిరించి.. ముగ్గురు క్రికెటర్లను దోచుకున్న దుండగులు!…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుగు రోజుల విదేశీ పర్యటన కోసం మంగళవారం పశ్చిమాసియాకు వచ్చారు. మంగళవారం నుంచి 4 రోజుల పాటు సౌదీ, యూఏఈ, ఖతార్‌లో పర్యటించనున్నారు.
Tech Mahindra: ఖతార్లో గుజరాత్‌కి చెందిన భారతీయ ఉద్యోగి అమిత్ గుప్తా అరెస్ట్ రెండు దేశాల మధ్య దౌత్య వివాదంగా మారింది. ఈ అరెస్ట్ క్రిమినల్ కేసు దర్యాప్తులో భాగంగా జరిగినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. డేటా చౌర్యం కేసులో ఈ అరెస్ట్ జరిగిందనే వార్తలు వస్తున్నాయి. టెక్ మహీంద్రా ఖతార్ విభాగానికి అమిత్ గుప్తా సీనియర్ ఉద్యోగిగా ఉన్నారు.
S. Jaishankar: భారత విదేశాంగ శాఖ మంత్రి S. జైశంకర్ నేటి నుంచి మూడు రోజుల పాటు ఖతార్ లో పర్యటించడానికి వెళ్తున్నారు. ఇక, తన పర్యటనలో ఖతార్ ప్రధాన మంత్రితో పాటు విదేశాంగ మంత్రి, హెచ్ఈ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.
Trump Effect: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు హమాస్ ఉగ్రవాదం సంస్థలకు మద్దతుగా వ్యవహరిస్తూ, హమాస్ నాయకులకు ఆశ్రయం ఇస్తున్న ఖతార్ తన వైఖరిని మార్చుకుంది. దోహాలో నివసిస్తున్న హమాస్ లీడర్లను బహిష్కరించేందుకు ఖతార్ అంగీకరించింది. అమెరికా నుంచి నుంచి వచ్చిన ఒత్తిడి తర్వాత ఖతార్ ఈ నిర్ణయం తీసుకుంది.
Hamas : ఇజ్రాయెల్‌తో యుద్ధంలో హమాస్‌కు ఖతార్ నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా ఆదేశాల మేరకు దోహాలోని తన దౌత్య కార్యాలయాన్ని మూసివేయాల్సి ఉంటుందని ఖతార్ 10 రోజుల క్రితమే హమాస్‌తో చెప్పిందని బిడెన్ అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారులు శుక్రవారం ఇక్కడ తెలిపారు.
ఢిల్లీ నుంచి దోహాకు వెళ్తున్న విమానాన్ని పాకిస్తాన్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్ని వచ్చింది. ఓ ప్రయాణికుడికి హెల్త్ ఇష్యూ రావడంతో విమానాన్ని కరాచీలో ల్యాండ్ చేశారు.
Zakir Naik: ఫిఫా ప్రపంచకప్ పోటీలను వీక్షించేందుకు వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు పీస్ టీవీ వ్యవస్థాపకుడు, ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్‌ఎఫ్) అధినేత జకీర్‌నాయక్ ను ఆహ్వానించారనే వార్తలపై ఖతార్ వివరణ ఇచ్చింది.