Stray Dogs Attack: కుక్కల దాడుల్లో అమాయకపు పిల్లలు దారుణంగా మరణిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో కుక్కల దాడుల వల్ల చాలా మంది మరణించారు. ఇదిలా ఉంటే మరోసారి ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ మహారాజ్ గంజ్ ప్రాంతంలో వీధికుక్కల దాడుల్లో 11 ఏళ్ల బాలుడు బలయ్యాడు. మహారాజ్‌గంజ్‌లోని శాస్త్రి నగర్ ఇంటర్మీడియట్ కళాశాల మైదానంలో 11 ఏళ్ల బాలుడిని వీధికుక్కలు కొట్టి చంపినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
గత కొన్ని రోజులుగా వీధి కుక్కలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. చిన్నారులపై కుక్కల దాడులు ఎక్కువైపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఒకే ఇంట్లోని ఇద్దరు చిన్నారులను వీధి కుక్కలు కరిచి చంపేశాయి.
హైదరాబాద్ పరిధిలో కుక్కల దాడులు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఇటీవల అంబర్ పేటలో బాలుడి మృతి ఘటన మరువక ముందే మరో ఘటన జరిగింది. కంటికి కనిపించిన వారిని కరుస్తూ ఆస్పత్రి పాలు చేస్తున్నాయి వీధి కుక్కలు.
తెలంగాణ రాష్ట్రంలో చిన్నారులపై కుక్కల దాడులు హడలెత్తుస్తున్నాయి. నిన్న అంబర్ పేట్ పోలీస్టేషన్ పరిధిలో చిన్నారిపై కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటన మరువక ముందే మరో ఇద్దరు చిన్నారులపై కుక్కలదాడి భయాందోళన కలిగిస్తుంది.