Dogs Attack: జవహర్ నగర్ పరిధిలోని వికలాంగుల కాలనీలో వీధి కుక్కల వీరంగం సృష్టించాయి.ఇంటి బయట ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు విహాన్ పై విచక్షణారహితంగా దాడి చేయడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
Stray Dogs Attack: పంజాబ్‌లో దారుణం జరిగింది. 32 ఏళ్ల మహిళపై దాదాపుగా 20 వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటన కపుర్తలా జిల్లాలోని పస్సాన్ కడిమ్ గ్రామంలో చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం స్థానిక సుల్తాన్ పూర్ లోధిలో మహిళ పశువుల్ని మేపేందుకు పొలాల్లోకి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
5 Months Old Boy Dies in Street Dogs Attack in Shaikpet: వీధి కుక్కలు మరో చిన్నారి ప్రాణాలను బలి తీసుకున్నాయి. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడు, ఖమ్మంలోని రఘునాథపాలెం మండలంలో 5 ఏళ్ల చిన్నారి కుక్కల దాడిలో మృతి చెందిన ఘటనలు ఇంకా మన కళ్ల ముందు మెదలాడుతుండగానే.. తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని షేక్‌పేటలో వీధి కుక్కల దాడిలో 5 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. కుక్కల దాడిలో…
తెలంగాణాలో వీధికుక్కలు జనాలను వణికిస్తున్నాయి.. పిల్లలను బయటకు పంపాలంటే జంకుతున్నారు.. వీధికుక్కల దాడిలో ఇప్పటికే చాలా మంది చిన్నారులు ప్రాణాలను కోల్పోయారు.. వీధికుక్కలు దాడుల్లో పలువురు మరణిస్తే మరికొంతమంది ఆసుపత్రి పాలవుతున్నారు. అంబర్ పేటలో వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటన మరవకముందే తాజాగా హన్మకొండలో వీధికుక్కల దాడికి మరో బాలుడు ప్రాణాలు విడిచాడు. అప్పటివరకు ఆడుకుంటున్న ఆ బాలుడిపై కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఈ దాడిలో గాయపడిన 18 నెలల బాలుడు ఆసుపత్రిలో…
Dog Attack: వీధికుక్కల దాడులు దేశంలో ఎక్కువ జరుగుతున్నాయి. తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ ఘటనలు నమోదయ్యాయి. వీధికుక్కల దాడుల్లో చిన్నారు, పెద్ద వయసు ఉన్న వారు మరణిస్తున్నారు. వీరే ఈజీగా వాటికి టార్గెట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే కేరళ రాష్ట్రంలో నీల్మబూర్ లో మంగళవారం ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఎల్‌కేజీ చదువుతున్న పిల్లాడు స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుందగా మూడు వీధికుక్కలు దాడి చేశాయి.
Rashmi Gautam : జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె బుల్లితెరపై అందాలు ఒలకపోస్తూ కుర్రాళ్లు టీవీలకు అతుక్కుపోయేలా చేసేస్తుంది. అందాల ప్రదర్శనతోనే కాకుండా సుధీర్ తో ప్రేమాయణం ఎపిసోడ్ తో నిత్యం వార్తలో హల్ చల్ చేస్తుంటారు. అమె ఓ యానిమల్ లవర్ అనే విషయం చాలా మందికి తెలుసు.
12-year-old boy mauled to death by stray dogs: అభం శుభం తెలియని చిన్నారుల పాలిట మృత్యవుగా మారుతున్నాయి కుక్కలు. పిల్లలే టార్గెట్ గా దాడులు చేస్తున్నాయి. పిల్లలతో పాటు వృద్ధులు, మహిళలు వీరికి ఈజీ టార్గెట్ అవుతున్నారు. దేశంలో రోజుల వ్యవధిలో ఎక్కడో చోట కుక్కల దాడులు వెలుగులోకి వస్తున్నాయి. మున్సిపల్ సిబ్బంది అసలు వీటి గురించి పట్టించుకోవడమే లేదు. ఇదిలా ఉంటే వీధికుక్కల ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ బాలుడిని చంపేశాయి.
Dogs Attack: ఇటీవల దేశంలో చాలా ప్రాంతాల్లో కుక్కల దాడులు జరుగుతున్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల దాకా కుక్కల దాడులకు గురవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు వీటికి ఈజీగా టార్గెట్ అవుతున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో మార్నింగ్ వాక్ వెళ్లిన ఓ వ్యక్తిపై దాడి చేసి చనిపోయే వరకు కరిచి చంపాయి. దీనికి సంబంధించిన వీడియో అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు…