Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సమయంలో 2జీ కుంభకోణం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా ఎలాంటి మచ్చ లేని మన్మోహన్ సింగ్ పరిపాలనలో 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బొగ్గు కుంభకోణం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. 2జీ స్కామ్ ఆరోపణలు ఉన్నప్పటికీ ఏ రాజాని మరోసారి తన మంత్రివర్గంలోకి మన్మోహన్ సింగ్ తీసుకున్నారు. దీనిపై 2011లో ఆయన ఓ జాతీయ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై ఆరు కొరడా దెబ్బలు కొట్టించుకుని.. మురుగన్‌కు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా డీఎంకే ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ.. రాష్ట్రంలో స్టాలిన్ సర్కార్ ను గద్దె దించేందుకు ఇవాళ్టి నుంచి 48 గంటల పాటు ఉపవాస దీక్ష చేస్తానని శపథం చేశారు.
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై రాజకీయ శపథం చేశారు. గురువారం రాజకీయంగా సంచలన ప్రకటన చేశారు. తమిళనాడులో అధికార డీఎంకే పార్టీని గద్దె దించేదాకా పాదరక్షలు ధరించనని సవాల్ విసిరారు.
Anna University: చెన్నై అన్నా యూనివర్సిటీలో దారుణం జరిగింది. యూనివర్సిటీలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తులు లైంగిక దాడి చేశారు.
ఇదిలా ఉంటే, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ఆదివారం జరిగిన డీఎంకే కార్గవర్గ సమావేశంలో 12 తీర్మానాలను ఆమోదించింది. పార్లమెంట్‌లో బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తొలి తీర్మానం చేశారు. ఈ తీర్మానంలో అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండించారు. ‘‘ప్రజాస్వామ్య దేవాలయంలో దేశ హోంమంత్రి ఇంత అవమానకరంగా మాట్లాడటం సిగ్గుచేటు.
Annamalai: చెన్నై ఎయిర్‌పోర్టులో నటుడు-రాజకీయ నాయకుడు విజయ్, నటి త్రిష ఫోటోల వెనక రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఉందని, ఫోటోలను తీసి డీఎంకే ఐటీ టీమ్‌కి ఇచ్చిందని తమిళనాడు బీజేపీ చీఫ్ కే. అన్నామలై ఆరోపించారు. చెన్నై ఎయిర్ పోర్టులో విజయ్-త్రిషలు ప్రైవేట్ సెక్యూరిటీ చెక్ జరుగుతున్న సమయంలో వారి వీడియోను తీశారని అన్నామలై అన్నారు.
Udhayanidhi Stalin: తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తాను మతసామరస్యాన్ని గౌరవిస్తానని ప్రకటించారు. తాను ‘‘క్రైస్తవుడినని గర్విస్తున్నాను’’ అని ప్రకటించుకుుంటూనే, అన్ని విశ్వాసాలను కలుపుకుని ముందుకు వెళ్తానని చెప్పారు. క్రిస్మస్ కార్యక్రమానికి హాజరైన ఉదయనిధి మాట్లాడుతూ.. విభజన, విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి కొందరు మతాన్ని ఉపయోగించుకున్నారని ఆరోపించారు.
BJP: ఉగ్రవాది ఎస్ఏ బాషా అంత్యక్రియల ఉరేగింపుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంపై తమిళనాడు ప్రభుత్వం, ఇండియా కూటమిపై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. డీఎంకే పార్టీపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పునావాలా బుధవారం మండిపడ్డారు. అల్-ఉమ్మర్ సంస్థ వ్యవస్థాపకుడు బాషా పెరోల్‌పై బయటకు వచ్చిన సమయంలో అనారోగ్యంతో మరణించారు. 1998 కోయంబత్తూర్ వరస పేలుళ్ల ఘటనలో బాషా మాస్టర్ మైండ్‌గా ఉన్నాడు. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు.
Supreme Court: ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని కించపరిచేలా మాట్లాడటం తప్పే.. అందువల్ల ఈ కేసు విచారణ ఎదుర్కోవాల్సిందేనని అన్నాడీఎంకే సీనియర్ నేత సీవీ షణ్ముగంకు సుప్రీంకోర్టు తెలిపింది.
TVK Party: సినీ నటుడు దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ బలోపేతానికి సన్నాహాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 120 మంది జిల్లా కార్యదర్శులను నియమించేందుకు ఆ పార్టీ హైకమాండ్ ప్లాన్ చేస్తుంది.