Prices: దసరా, దీపావళి పండగల వేళ నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. సామాన్య ప్రజలు ఏం కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఏ దుకాణానికి వెళ్లినా ధరల భారం తప్పడం లేదని మహిళలు అంటున్నారు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో శనివారం దీపావళి బోనస్ ఇవ్వడానికి నిరాకరించినందుకు దాబా యజమానిని అందులో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు కొట్టి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దీపావళి బోనస్‌ను ఇవ్వడానికి యజమాని తిరస్కరించడంతో శనివారం తెల్లవారుజామున నాగ్‌పూర్ గ్రామీణ ప్రాంతంలోని కుహి ఫాటా సమీ
దీపావళి పండుగ వేళ కోనసీమలో అపశృతి చోటుచేసుకుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ఆవిడి కట్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద పూరింటిపై తారాజువ్వ పడి అగ్ని ప్రమాదం సంభవించింది.
ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి ఇంద్రకీలాద్రి ఆలయం మూసివేయనున్నారు. ఈరోజు దీపావళి సందర్భంగా అమ్మవారి ప్రధానాలయము నందు సాయంత్రం 5 గంటలకు ధనలక్శ్మి పూజను నిర్వహించారు. సాయంత్రం 06 గంటలకు అమ్మవారికి పంచహారతులు సేవను నిర్వహించారు.
దీపావళి/ఛత్ పూజా సీజన్‌లో, రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం మరియు ప్రయాణీకుల అదనపు రద్దీని అధిగమించడానికి దక్షిణ మధ్య రైల్వే సాధారణ, రోజువారీ ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. రైలు ప్రయాణీకుల ప్రయోజనం కోసం జోన్‌లోనే కాకుండా జోన్ వెలుపలి గమ్యస్థానాలకు కూడా ప్రత్య
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి అంటే కాంతి-వెలుగు అని సీఎం పేర్కొన్నారు.
Diwali Holidays: దీపావళి పండుగకు ఈ నెల 12 ఆదివారం సెలవు ఇస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే 13 సోమవారం దీపావళి సెలవు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.
దీపావళి సెలవులో కీలక మార్పు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాలెండర్లో గానీ, ప్రభుత్వం జారీ చేసిన పండగ సెలవుల జాబితాలో గానీ దీపావళి నవంబర్ 12వ తేదీ అని ఉంది. 12వ తేదీన ఉన్న సెలవును 13వ తేదీన సాధారణ సెలవుగా పేర్కొంటూ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు విడుదల చేశారు.