కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలపై కర్ణాటక ప్రభుత్వం మండిపడింది. దీనికి వ్యతిరేకంగా గురువారం కర్ణాటక కేబినెట్ సమావేశం కానుంది. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో బిల్లును ఆమోదించాలని యోచిస్తోంది.
సాయంత్రం ఢిల్లీలో ఎన్డీఏ కూటమి కీలక భేటీ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇంట్లో ఈ సమావేశం జరగనుంది. కేంద్ర మంత్రులు, బీజేపీ మిత్రపక్షాలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ భేటీలో ప్రధానంగా లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై చర్చ జరగనుంది.
శనివారం కాంగ్రెస్ సీఈసీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలపై కాంగ్రెస్ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు.