ఒకప్పుడు మాటల మాంత్రికుడు అనగానే తెలుగువారికి ప్రఖ్యాత రచయిత పింగళి నాగేంద్రరావు గుర్తుకు వచ్చేవారు. కానీ, ఈ తరం ప్రేక్షకులు మాత్రం ‘మాటల మాంత్రికుడు’ అని త్రివిక్రమ్ కు పట్టం కట్టేశారు. త్రివిక్రమ్ సైతం తన ప్రతి చిత్రంలో మాటలతో పరాక్రమం చూపిస్తూనే ఉన్నారు. ఆయన మాటలు పదనిసలు పలికించినట్టుగా ఉంటాయి. కొన్నిసార్లు సరిగమలూ వినిపిస్తాయి. మరికొన్ని సార్లు వీరధీరశూరంగా విజృంభిస్తాయి. అందుకే జనం ‘మాటల మాంత్రికుడు’ అనేశారు. త్రివిక్రమ్ కూడా ఆ మాటను నిలుపుకుంటూ తన…