నవతరం ప్రేక్షకుల భావాలకు అనుగుణంగా చిత్రాలను నిర్మించి, తొలి ‘చిత్రం’తోనే భళారే విచిత్రం అనిపించారు దర్శకుడు తేజ. ఆయన దర్శకునిగా మెగాఫోన్ పట్టకముందే చిత్ర నిర్మాణానికి సంబంధించిన పలు శాఖల్లో పనిచేశారు. లైట్ బోయ్ గా కొన్ని సినిమాలకు పనిచేసిన తేజ, ఆ తరువాత ముంబయ్ లో పలువురు సినిమాటోగ్రాఫర్స్ వద్ద అసోసియేట్ గా ఉన్నారు. సినిమాటోగ్రఫీతోనూ అలరించారు. దర్శకునిగా, ఛాయాగ్రాహకునిగా యువతను ఆకట్టుకోవడంతోనే సాగారు తేజ. జాస్తి ధర్మతేజ 1966 ఫిబ్రవరి 22న జన్మించారు. ఆయన…
(ఆగస్టు 10తో ‘నువ్వు-నేను’కు 20 ఏళ్ళు) తొలి ప్రయత్నంగా దర్శకుడు తేజ రూపొందించిన ‘చిత్రం’ అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకొని సంచలన విజయం సాధించింది. ఆ చిత్ర కథానాయకుడు ఉదయ్ కిరణ్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించి పెట్టింది. తరువాత ఉదయ్ కిరణ్ హీరోగా తేజ రూపొందించిన చిత్రం ‘నువ్వు-నేను’. ఇందులోనూ ప్రేమకథనే తీసుకొని మరోమారు యువతను రంజింప చేస్తూ అంతకు మించిన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు తేజ. ఈ చిత్రంతో…