టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ దర్శకుడు పి. చంద్ర శేఖర్ రెడ్డి ఈ రోజు ఉదయం 8.30 లకు చెన్నైలో మృతి చెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. చంద్ర శేఖర్ రెడ్డి తన సినీ కెరీర్లో సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి టాలీవుడ్ లెజెండరీ నటులతో ఆయన పని చేశారు. అంతేకాదు నాటి ప్రముఖ హీరోలు అందరి చిత్రాలకు ఆయన…