టాలీవుడ్ లో విషాదం… ప్రముఖ దర్శకుడు కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ దర్శకుడు పి. చంద్ర శేఖర్ రెడ్డి ఈ రోజు ఉదయం 8.30 లకు చెన్నైలో మృతి చెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. చంద్ర శేఖర్ రెడ్డి తన సినీ కెరీర్లో సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి టాలీవుడ్ లెజెండరీ నటులతో ఆయన పని చేశారు. అంతేకాదు నాటి ప్రముఖ హీరోలు అందరి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అందులో సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలకు ఎక్కువగా దర్శకత్వం వహించారు. ఆయన కన్నుమూసిన విషయం తెలిసిన సినీ ప్రముఖులు పి.సి.రెడ్డికి సంతాపం తెలియజేస్తున్నారు.
Read Also : డైరెక్టర్ కి బాలయ్య వార్నింగ్… 6 నెలలు ఆ హీరోను కలవొద్దు !
Also Read
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
పి.సి.రెడ్డిగా చిత్రసీమలో పేరొందిన ఆయన పూర్తి పేరు పందిళ్ళపల్లి చంద్రశేఖరరెడ్డి. నెల్లూరు జిల్లాలోని అనుమసముద్రం పేటలో 1933 అక్టోబర్ 14న జన్మించారు. 1971లో కృష్ణ, విజయనిర్మల జంటగా రూపొందిన ‘అనూరాధ’ చిత్రంతో దర్శకునిగా పరిచయమయ్యారు పి.సి.రెడ్డి. ‘అత్తలూ-కోడళ్ళు’, ‘విచిత్ర దాంపత్యం’, ‘ఇల్లు-ఇల్లాలు’, ‘బడిపంతులు’, ‘తాండవ కృష్ణుడు’, ‘మానవుడు-దానవుడు’, ‘నాయుడుబావ’, ‘మానవుడు-మహనీయుడు’, ‘పుట్టింటి గౌరవం’, ‘ఒకే రక్తం’, ‘రాముడు-రంగడు’, ‘జగ్గు’, కృష్ణ హీరోగా పి.సి.రెడ్డి దర్శకత్వంలో “అత్తలు- కోడళ్ళు, అనూరాధ, ఇల్లు-ఇల్లాలు, తల్లీకొడుకులు, మమత, స్నేహబంధం, గౌరి, పెద్దలు మారాలి, కొత్తకాపురం, సౌభాగ్యవతి, పాడిపంటలు, జన్మజన్మల బంధం, పట్నవాసం, ముత్తయిదువ, భోగభాగ్యాలు, పగబట్టిన సింహం, బంగారుభూమి, పులిజూదం, నా పిలుపే ప్రభంజనం, ముద్దుబిడ్డ” చిత్రాలు రూపొందాయి. కృష్ణ హీరోగా మొత్తం 20 చిత్రాలు తెరకెక్కించారు పి.సి.రెడ్డి. ఆయన వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన బి.గోపాల్, ముత్యాల సుబ్బయ్య, పి.యన్.రామచంద్రరావు, శరత్, వై. నాగేశ్వరరావు వంటివారు దర్శకులుగా రాణించారు. కృష్ణకు లక్కీ డైరెక్టర్ గా పేరు సంపాదించిన పి.సి.రెడ్డి, నటరత్న యన్టీఆర్ తో చేసిన ఏకైకచిత్రం బడిపంతులు. పి.సి.రెడ్డి చివరి చిత్రం జగన్నాయకుడు (2014).
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?