Director Anil Kumar: సంతోష్ శోభన్, ప్రియ భవానీ శంకర్ జంటగా నటించిన సినిమా 'కళ్యాణం కమనీయం'. యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించిన ఈ కుటుంబ కథా చిత్రాన్ని నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.