Director Anil Kumar: కొత్తగా పెళ్ళైన జంటకు ఎదురయ్యే ఇగో గేమ్స్ ఈ ‘కళ్యాణం కమనీయం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Director Anil Kumar: సంతోష్ శోభన్, ప్రియ భవానీ శంకర్ జంటగా నటించిన సినిమా ‘కళ్యాణం కమనీయం’. యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించిన ఈ కుటుంబ కథా చిత్రాన్ని నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు దర్శకుడు అనిల్ కుమార్. ‘మా స్వస్థలం గుంటూరు. చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఆసక్తి ఉంది. చదువు పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చి ప్రయత్నాలు ప్రారంభించాను. వారాహిలో తుంగభద్ర చిత్రానికి పనిచేశాను. స్నేహితుడు అజయ్ కుమార్ రాజు ద్వారా యూవీ క్రియేషన్స్ లో ఈ సినిమా లైన్ చెప్పి అవకాశం దక్కించుకున్నా. పెళ్లయ్యాక భర్తకు జాబ్ లేకుంటే భార్య ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందనేది ఈ చిత్రంలో చూపిస్తున్నాం. ఇంకా ట్రైలర్ లో రివీల్ చేయని చాలా అంశాలు సినిమాలో ఉన్నాయి. సంతోష్ శోభన్, ప్రియ భవానీ శంకర్ శివ, శృతి పాత్రల్లో ఆకట్టుకుంటారు. తమ చుట్టూ జరిగే ఇగో గేమ్స్ ను ఈ యువ జంట ఎలా ఎదుర్కొన్నారనేది ఆస్తికరంగా ఉంటుంది. యూవీ లాంటి పెద్ద సంస్థలో తొలి చిత్రానికి దర్శకత్వం వహించడం అదృష్టంగా భావిస్తున్నాను.
సంక్రాంతికి స్టార్స్ సినిమాలు విడుదలవుతున్నాయి. అయినా మా కంటెంట్ మీద నమ్మకం ఉంది. క్లీన్ యూ సినిమా చేసినందుకు గర్వపడుతున్నాం. నా జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలు కూడా ఈ కథకు స్ఫూర్తి. ఇక మా చిత్రంలో పాటలకు మంచి స్పందన వస్తోంది. శ్రావణ్ భరద్వాజ్ చక్కటి మ్యూజిక్ ఇచ్చారు. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. దర్శకుడిగా నా ఫేవరేట్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. ఎమోషన్ చూపించాలంటే మణిరత్నం.. హై లోకి తీసుకెళ్లాలంటే రాజమౌళి.. సొసైటీకి మంచి చెప్పే చిత్రాల విషయంలో శంకర్.. యాక్షన్ అంటే బోయపాటి.. ఇలా చాలా మంది అభిమాన దర్శకులు ఉన్నారు. వ్యక్తిగతంగా నాకు రొమాంటిక్ కామెడీతో పాటు యాక్షన్ జానర్ ఇష్టం. ఈ సినిమా విడుదలైన తర్వాత త్వరలో నా కొత్త సినిమా వివరాలు చెబుతాను’ అని అంటున్నారు అనిల్ కుమార్.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
తాజావార్తలు
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!