భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ సోమవారం క్రీడలకు రిటైర్మెంట్ ప్రకటించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో దీపా అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన దీపా.. స్వల్ప తేడాతో కాంస్య పతకాన్ని కోల్పోయింది. ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారతదేశపు తొలి మహిళా జిమ్నాస్ట్‌గా 31 ఏళ్ల దీపా నిలిచింది. కాగా.. రియో ఒలింపిక్స్‌లో వాల్ట్ ఈవెంట్‌లో నాలుగో స్థానంలో నిలిచి కేవలం 0.15 పాయింట్ల తేడాతో కాంస్య పతకాన్ని కోల్పోయింది.