భారత స్టార్ అథ్లెట్‌పై డోపింగ్ నిషేధం పడింది. రియో ఒలింపిక్స్‌లో భారత్ ఖ్యాతిని ఇంటర్నేషనల్ లెవెల్‌కు తీసుకెళ్లిన స్టార్ జిమ్నాస్టిక్ ప్లేయర్ దీపా కర్మాకర్‌పై నిషేధికత డ్రగ్స్ తీసుకున్నందుకు అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఐటీఏ) 21 నెలల నిషేధం విధించింది. 2021 అక్టోబర్‌లో ఆమెకు నిర్వహించిన శాంపిల్- ఏ టెస్టు రిజల్ట్ పాజిటివ్‌గా వచ్చింది. అయినప్పటికీ ఈ విషయాన్ని బయటపెట్టలేదు. అయితే తాజాగా ఈ విషయం బయటపడింది. దీంతో ఆమెపై ఐటీఐ సస్పెన్షన్ వేటు పడింది. 2021 నుంచి శిక్షాకాలం అమలు కావడంతో ఈ ఏడాది జూలై 10వ తేదీతోనే నిషేధం ముగుస్తుంది.
Also Read: Yusuf Pathan: ‘నేనెళ్లిపోతా’.. డ్రెస్సింగ్ రూమ్‌లో యూసప్ పఠాన్ హంగామా
కాగా 2016 రియో ఒలింపిక్స్‌లో వాల్ట్ ఈవెంట్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన దీపా కర్మాకర్ నాల్గొవ స్థానంతో సరిపెట్టుకుంది. 2017లో కాలి గాయం వల్ల జిమ్నాస్టిక్స్‌కు దూరమైంది. గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నప్పటి ఆమె ఇంకా గాయాలతో పోరాడుతోంది. 2019లో బాకులో జరిగిన ప్రపంచ కప్ ఈవెంట్‌లో ఆమె చివరిసారిగా బరిలో దిగింది. ఈ నిషేధం వల్ల దీప పలు టోర్నీల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. అపారటస్ వరల్డ్ కప్ సిరీస్‌తో పాటు కనీసం మూడు వరల్డ్‌కప్ సిరీస్‌లకు కూడా దీప దూరం కానుంది. అయితే సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ఆంట్‌వెర్ప్‌లో జరగనున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Delhi Girl : ఢిల్లీలో ఘోరం.. దేశానికి కాదు దారుణాలకు రాజధాని