Nitin Gadkari: కేంద్రం డీజిల్ వాహనాలు కొనుగోలు చేసుందుకు సిద్ధమయ్యారు. అయితే ఒక్క క్షణం ఆగాల్సింది. రానున్న రోజుల్లో డిజిల్ వాహనాల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. డీజిల్ కార్లకు ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అన్నారు. దాదాపుగా 10 శాతం జీఎస్టీ పెంపును ప్రతిపాదించే అవకాశం ఉందన్నారు.
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి వాహనదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇకపై తాము డీజిల్ కార్లను తయారుచేసేది లేదని ప్రకటించింది. 2023 తర్వాత దేశంలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయని.. దీంతో డీజిల్ కార్ల అమ్మకాలు తగ్గిపోతాయని కంపెనీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మారుతి సుజుకి అధికారికంగా తెలిపింది. కర్బన ఉద్గారాల నియంత్రణ నిబంధనలను పాటిస్తూ డీజిల్ కార్ల తయారీని నిర్వహించడంతో ఖర్చు అధికంగా పెరుగుతుందని మారుతీ సుజుకి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్…