మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్తున్న ఆరుగురు మృత్యువాత చెందారు. ఖతుశ్యామ్ బాబాను దర్శించుకునేందుకు వెళ్తుండగా జైపూర్ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గుర్తు తెలియని వాహనం భక్తులతో వెళ్తున్న కారును ఢీకొట్టింది.
ఘజియాబాద్‌లో ఓ బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. జూలై 12న ఘుక్నా నివాసి శివాని త్యాగి ఆత్మహత్య చేసుకున్న కేసులో సోదరుడి ఫిర్యాదు మేరకు నందగ్రామ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. సూసైడ్ నోట్ ఆధారంగా శివాని సోదరుడు రిపోర్టు ఇచ్చాడని పోలీసులు చెబుతున్నారు. ఇందులో శివాని సహోద్యోగులు మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఈద్-ఉల్-అజా పండుగ సందర్భంగా.. సౌదీ అరేబియాకు పెద్ద సంఖ్యలో హజ్ యాత్రికులు తరలివచ్చారు. అయితే.. సౌదీ అరేబియాలో తీవ్రమైన ఎండలు, వేడితో హజ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హజ్ సమయంలో 47 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో.. వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో.. మక్కాలో విపరీతమైన వేడిమి కారణంగా ఆరుగురు మరణించారు.
రష్యాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నదిలో మునిగి నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మరణించారు. ఒకరు రక్షించబడ్డారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.
వరల్డ్ ఓల్డెస్ట్ అవిభక్త కవలలుగా ప్రపంచ రికార్డు సృష్టించిన లోరీ, జార్జ్ షాపెల్ కన్నుమూశారు. 62 ఏళ్ల వయసులో వీరు మరణించారు. అమెరికాలోని పెన్సిల్వేనియా వర్సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వీరి మరణానికి గల కారణాలు తెలియరాలేదు. ఏప్రిల్ 7న వీరు చనిపోగా.. తాజాగా ఈ విషయం బయటకు వచ్చింది.
మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 13 ఏళ్ల బాలిక మరణించింది. తన ప్రాణాలను కాపాడుకునేందుకు టార్పాలిన్ మీద దూకింది కానీ ఆమె బరువు కారణంగా ప్లాస్టిక్ టార్పాలిన్ చిరిగిపోవడంతో సీసీ రోడ్డు మీద పడిపోవడంతో బలంగా తలకు గాయం కావడంతో ప్రాణాలు కోల్పోయింది.
వరల్డ్ మోస్ట్ వాంటెడ్ మసూద్ అజార్ మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. తెల్లవారుజామున 5 గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన బాంబు పేలుడులో చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పాకిస్థాన్ ఇంకా ధృవీకరించలేదు. సోమవారం ఉదయం భవల్‌పూర్ మసీదు నుంచి తిరిగి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై బాంబు విసిరినట్లు కథనాలు వెలువడుతున్నాయి. దాడికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో మార్కెట్‌లో పేలుడు జరుగుతున్నట్లు కనిపిస్తోంది.…