Snake Bite: పాము కాటుకు చికిత్స త్వరగా అందడం లేదు.. ఏటా 60వేల మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Snake Bite: పామును చూస్తే భయంతో పారిపోతాం. పాములు కూడా మనుషులను చూసి భయపడిపోతాయి. అనుకోకుండా పాము కాటేస్తే .. దానికి చికిత్స చేయించుకోవడానికి చూస్తాం. కానీ ఇప్పటికీ గ్రామాల్లో పాము కాటుకు నాటు వైద్యంపై ఆధారపడుతున్నారు తప్ప.. ఆసుపత్రికి తీసుకెళ్లడమో.. లేకపోతే సరైన చికిత్సను అందించడమో చేయడం లేదు. పాము కాటుకు ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నా ఇప్పటికీ ఎంతో మంది ప్రజలు నాటు వైద్య విధానాలను విశ్వసిస్తున్నారు. ముఖ్యంగా పాముకాటుకు గురైనవారికి గోల్డెన్ అవర్స్‌లో అంటే తొలి 3 గంటల వ్యవధిలోగా మెరుగైన చికిత్స అందక ఏటా 60 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో 75 శాతం నుంచి 80 శాతం మంది వైద్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే మృత్యువాత పడుతున్నట్టు తాజా అధ్యయన నివేదికలో సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) తేల్చింది. అంతర్జాతీయ పాముల దినోత్సవం సందర్భంగా సీసీఎంబీ ఈ నివేదికను వెల్లడించింది. పాము కాటు బాధితులకు కొన్ని సందర్భాల్లో నాటు వైద్యం సత్ఫలితాలను ఇస్తున్నప్పటికీ క్లిష్ట సమయాల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని ఆ నివేదికలో పేర్కొన్నారు. మన దేశంలో 60 రకాలకుపైగా విషసర్పాలు మనుగడ సాగిస్తున్నాయి. వీటి కాటుకు గురైనవారిలో చాలా మందికి ప్రథమ చికిత్సపై అవగాహన లేకపోవడం, నాటు వైద్యాన్ని ఆశ్రయించడం, సకాలంలో మెరుగైన వైద్య చికిత్స చేయించుకోకపోడంతో పక్షవాతం, కణజాలం నిర్వీర్యమవడం, మెదడులో రక్తం గడ్డకట్టడం వలన 80 శాతం మేరకు మరణాలు సంభివిస్తున్నట్టు సీసీఎంబీ పేర్కొన్నది.
Read also: Naga Chaitanya: ఒకేసారి ఇద్దరు హిట్ డైరెక్టర్స్ తో అక్కినేని హీరో…
Also Read
- September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
పాము కాటు బాధితులకు గోల్డెన్ అవర్స్ ముగిసేలోగా యాంటీ వీనమ్ డోస్‌ను అందించగలిగితే ఎన్నో మరణాలను నియంత్రించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో యాంటీ వీనమ్‌కు భారీ డిమాండ్ ఉన్నది. 80 శాతం యాంటీ వీనమ్‌ను తమిళనాడులోని ఇరులా సహకార సంఘం నుంచి సేకరిస్తున్నారు. అయితే పర్యావరణం మరియు భౌగోళిక అంశాలను బట్టి సర్పాల విషతీవ్రత భిన్నంగా ఉంటుందని.. ఈ నేపథ్యంలో స్థానిక పరిస్థితులను బట్టి ప్రాంతాలవారీగా యాంటీ వీనమ్‌ను తయారు చేయాల్సిన అవసరం ఉన్నదని పరిశోధకులు స్పష్టం చేశారు. కాబట్టి భవిష్యత్‌లో పాము కాటుకు గురైన వారు గోల్డెన్ హవర్ కాలంలో యాంటీ వీనమ్ డోస్‌ను అందించడానికి ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.
- Tags
- Bites
- die
- Not Treated
- Quickly
- snake
తాజావార్తలు
-
MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!