Tamil Nadu: కొడుకు చదువు కోసం చావుకు సిద్ధమైంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: కొడుకును ఉన్నత చదువు చదివించడం కోసం ఆ మహిళ చావుకు సిద్ధమైంది. కొడుకు కాలేజీ ఫీజు కట్టేందుకు పరిహారం కోసం బస్సు ముందుకు దూకిన ఆ మహిళ మృతి చెందింది. ఈ ఘటన తమిళనాడులోని సేలంలో జరిగింది. తమిళనాడులోని సేలం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న ఒక మహిళ, తన కొడుకు భవిష్యత్తు కోసం తమిళనాడు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం కోసం కదులుతున్న బస్సు ముందు దూకింది. జూన్ 28న ఈ ఘటన జరుగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read also: Sangareddy: గురుకుల పాఠశాలలో విద్యార్థినిలకు అస్వస్థత.. వాంతులు విరోచనాలు
Also Read
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
- Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
జూన్ 28న సేలంలో 45 సంవత్సరాల వయస్సు గల పాపాతి తన కొడుకు కాలేజీ ఫీజు చెల్లించడం కోసం స్పీడ్‌గా వెళుతున్న బస్సు కింద పడి మరణించారు. ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి పరిహారం వస్తుందని ఎవరో చెప్పడంతో .. ఆ మహిళ ఇంతటి తీవ్రమైన చర్యకు పాల్పడట్టు తెలుస్తోంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఘటన జరిగిన సమయం కంటే ముందు పాపాతి బస్సు ముందు దూకడానికి ప్రయత్నం చేసినట్టు తెలిపారు. అయితే ఆమెను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో కొద్దిసేపటి తర్వాత.. ఆమె రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తూ మరొక బస్సు ముందు దూకడం కనిపించిందని.. ఫలితంగా ఆమె మరణించిందని పోలీసులు తెలిపారు. కొడుకు కాలేజీ ఫీజు కట్టలేక పాపాతి డిప్రెషన్‌తో పోరాడుతోందని బంధువులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదంలో చనిపోతే ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందని ఆమెను ఎవరో తప్పుదోవ పట్టించడంతో పాపాతి ఈ దుశ్చర్యకు పాల్పడింది. భర్త నుంచి విడిపోయిన పాపాతి.. గత 15 ఏళ్లుగా తన పిల్లలను తానే ఒంటరిగా పెంచుతోంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!